మదురై కోర్టులో బీఆరెస్స్ ఎమ్మెల్యేలు... కేసు ఏమిటంటే...?

అవును.... ఎల్బీనగర్ బీఆరెస్స్ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి, హుజూరాబాద్ బీఆరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మదురై మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు!

Update: 2024-01-10 09:56 GMT

బీఆరెస్స్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తాజాగా మదురై కోర్టు వద్ద కనిపించారు! ఇందులో భాగంగా ఈ రోజు మదురై మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ వేసిన పరువునష్టం కేసు విచారణలో భాగంగా ఇద్దరు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కోర్టుకు హాజరయ్యారు. దీంతో గతంలో వీరు మాణిక్యం ఠాగూర్ పై చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.


అవును.... ఎల్బీనగర్ బీఆరెస్స్ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి, హుజూరాబాద్ బీఆరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మదురై మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు! గతంలో పీసీసీ చీఫ్ పోస్టును అమ్ముకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ పై ప్రెస్ మీట్ లో వీరు చేసిన వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం కేసు వేశారు! ఈ నేపథ్యంలో వీరిద్దరూ విచారణకు హాజరయ్యారని తెలుస్తుంది!

కాగా... 2022 నవంబర్ లో పాడి కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్‌ పీసీసీ పదవీని రూ.40 కోట్లకు అమ్ముకున్నారని నాడు కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో మాణిక్కం ఠాకూర్... కౌశిక్ రెడ్డిపై మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

దీంతో మదురై కోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి తరపున ఎవరూ హాజరు కాకుంటే వారెంట్ జారీ చేస్తామని వెల్లడించింది. నాడు.. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌ చేసేందుకు గానూ ఆయన నుంచి మాణిక్యం ఠాగూర్ రూ.40 కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

కాగా... గడిచిన తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి డి. సుధీర్ రెడ్డి 22,305 ఓట్ల మెజారిటీతో గెలవగా... హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 16,873 ఓట్ల మెజారిటీతో పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News