ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నాయకుల రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. అధికార మార్పిడి జరిగింది. పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కు ప్రజలు విశ్రాంతి ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. అధికార మార్పిడి జరిగింది. పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కు ప్రజలు విశ్రాంతి ఇచ్చారు. కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు అప్పగించారు. దీంతో వారు ఇన్నాళ్లు ఎమ్మెల్సీలుగా చలామణి అయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టికెట్లు ఇవ్వడంతో పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్యాడ్యుయేట్ కోటాలో రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగారు. ఇక హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఎమ్మెల్సీకి రాజీనామా చేసి శాసనసభ్యుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా కొనసాగాలని బావించుకున్నారు. ఈక్రమంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలుగా మారాయి.
మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో మళ్లీ ఆ స్థానాల్లో బీఆర్ఎస్ నేతలకే అవకాశం ఉండనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వస్తే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను రంగంలోకి దించే వీలుంది. దీనికి గాను అభ్యర్థులను ఇప్పటికే వెతికి పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వారినే నియమించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఎమ్మెల్సీలకు రాజీనామా చేయడం కామనే. ఎందుకంటే ఎమ్మెల్యే పదవిలోనే ఎక్కువ రాయితీలు ఉంటాయి. అధికారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలి ఎమ్మెల్యేలుగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇంకా ఎవరైనా రాజీనామా చేస్తారేమో అని చూస్తున్నా ఎవరు లేరని తెలుస్తోంది.