వీడియో... ఎంపీ చెంప చెళ్లుమనిపించిన మహిళా కార్యకర్త!
ఈ విషయంలో ఆగ్రహం ఎక్కువమందికి వస్తే అది ఒక ఉద్యమంగా మారుతుంటుంది.. నిరసన కార్యక్రమాలకు తెరలేస్తుంటుంది.
భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులపై కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఆగ్రహం వచ్చినప్పుడు దాని పలు రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. ఈ విషయంలో ఆగ్రహం ఎక్కువమందికి వస్తే అది ఒక ఉద్యమంగా మారుతుంటుంది.. నిరసన కార్యక్రమాలకు తెరలేస్తుంటుంది. ఫలితంగా... ప్రభుత్వాలు దిగివచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
ఇక మరికొన్ని సందర్భాల్లో నేతలపై సిరా చల్లి తమ నిరసనను తెలియజేస్తుంటారు ఇంకొంతమంది. మరికొంతమంది ఆయా నాయకులు ప్రయాణిస్తున్న వాహనాలపై చెప్పులు విసరడం వంటివి కూడా చేస్తుంటారు! ఇక ఇలాంటివి ఏమీ చేయలేనివారిలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకుని కాస్త కూల్ అవుతారు.. ఇంకొంతమంది ఎన్నికలు వచ్చే వరకూ ఎదురుచూస్తుంటారు.
అయితే కొన్ని దేశాల్లో మాత్రం నాయకుల మీద ఆగ్రహాలను భౌతిక దాడులు, కాల్పులకు పాల్పడటం వంటి వాటితో తీర్చుకుంటుంటారు పలువురు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగిన క్రూక్ అనే యువకుడు... తన వీడియోలో "ఈ హేట్ ట్రంప్" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కార్యకర్త మాత్రం ఎంపీ చెంపపై కొట్టి తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది!
అవును... తాజాగా ఓ మహిళా కార్యకర్త బీఎస్పీ రాజ్యసభ ఎంపీపై చేయిచేసుకుంది. ఇందులో భాగంగా ఎంపీ చెంప చెళ్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మేరకు... బుధవారం బహుజన సమాజ్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం మహారాష్ట్రలో జరిగింది. ఈ సమయంలో వేదికపై ఉన్న ఎంపీ రాంజీ గౌతమ్ ను కలిసేందుకు వెళ్లిన మహిళా కార్యకర్త చెంపపై కొట్టింది.
దీంతో... ఎంపీతో సహా అక్కడున్నవారంత ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం అక్కడున్న కార్యకర్తలంతా ఆమెను వారించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. అయితే... ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో తలెత్తిన అసంతృప్తే ఈ దాడికి కారణం అని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది!