కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయ స్టూడెంట్స్ కి బ్యాడ్ న్యూస్!

ఈ మేరకు కెనడా స్టూడెంట్ వీసా స్కీం ను నిలిపేసింది. అందుకు పలు కారణాలు తెరపైకి వస్తున్నాయి. కారణాలేవైనా ఇది మాత్రం షాక్ అనే చెప్పాలి.

Update: 2024-11-09 16:30 GMT

ప్రస్తుతం భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన బంధాలు మునుపెన్నడూ లేనంత స్థాయిలో పతనం అయిన పరిస్థితి. నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై చేసిన ఆరోపణలే దీనికి కారణం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే విషయానికీ, దౌత్య బంధాలకూ సంబంధం లేకపోయినా కానీ... ఇది భారతీయ విద్యార్థుల మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెబుతున్నారు.

అవును... కెనడా వెళ్లి చదువుకోవాలనుకొంటున్న భారతీయ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది! ఇందులో భాగంగా... ఇన్నాళూ భారత్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆహ్వానిస్తూ వచ్చిన కెనడా తాజాగా షాక్ ఇచ్చింది. ఈ మేరకు కెనడా స్టూడెంట్ వీసా స్కీం ను నిలిపేసింది. అందుకు పలు కారణాలు తెరపైకి వస్తున్నాయి. కారణాలేవైనా ఇది మాత్రం షాక్ అనే చెప్పాలి.

ప్రస్తుతం కెనడా హౌసింగ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని అంటున్నారు. ఇదే సమయంలో... వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెబుతున్నారు. ఆ దేశంలోని విపరీతంగా వలసలు పెరిగిపోవడమే దీనికి కారణం అనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కారణాల కారణంగానే స్టూడెంట్స్ వీసా ప్రోగ్రాం విషయంలో కెనడా ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

కెనడా వెళ్లి చదువుకోవాలని చాలా మంది భారతీయులకు ఆసక్తిగా ఉంటుంది. ఇన్నాళ్లూ ఆ ఆసక్తికి తగ్గట్లుగానే కెనడా నుంచి మద్దతు లభిచేది! అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. దీంతో... అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఉద్దేశించబడిన "స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీం వీసా" కార్యక్రమాన్ని తాజాగా నిలిపేసింది.

వాస్తవానికి... భారత్ తో పాటు చైనా, కొలంబియా, బ్రెజిల్, మొరాకో, కోస్టారియా, పెరూ, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంతో సహా 14 దేశాలకు చెందిన స్టూడెంట్స్ స్టడీ పర్మిట్ అప్లికేషన్నలు వేగవంతం చేయడానికి ఐ.ఆర్.సీ.సీ కార్యక్రమాన్ని అమలు చేసింది. అయితే... ఈ స్కీం ద్వారా నవంబర్ 8న మధ్యాహ్నం 2 గంటల వరకూ స్వీకరించిన దరఖాస్తులే ప్రాసెస్ చేయబడతాయని తెలిపింది.

Tags:    

Similar News