అదానీపై అమెరికాలో కేసు... కేంద్రం నుంచి ఇంట్రస్టింగ్ రియాక్షన్!
అవును... అదానీ సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు రూ.2,100 కోట్ల భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
దీనిపై స్పందించిన అదానీ గ్రూప్... తమపై వచ్చిన ఆరోపణలను తోసి పుచ్చింది. కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలాను అసత్యాలని, నిరాధారమైనవని కొట్టి పారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో... కేంద్రం స్పందించింది!
అవును... అదానీ సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇందులో భాగంగా.. ఇది పుర్తిగా ప్రైవేటు సంస్థలు, కొంతమంది వ్యక్తులతో పాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారం అని పేర్కొంది.
ఇదే సమయంలో... ఈ వ్యవహారానికి సంబంధించి అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ముందస్తుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేసింది. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలూ స్పష్టంగా ఉన్నాయంటూ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు.
ఇదే సమయంలో... అదానీ కేసులో భారత్ కు అమెరికా నుంచి సమన్లు లేదా వారెంటుకు సంబంధించి ఎలాంటి విజ్ఞప్తీ రాలేదని స్పష్టం చేశారు. దీంతో... అదానీ వ్యవహారంలో కేంద్రం వైఖరిపై ఒక క్లారిటీ వచ్చేసినట్లే అని అంటున్నారు పరిశీలకులు.