అమ్మ నిర్మలమ్మా.. బీజేపీ కోసం బెదిరింపులా?!
కర్ణాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆమె బెదిరించారని, బీజేపీకి ఎన్నికల విరాళాలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.
బీజేపీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ నిర్మలా సీతారామన్ చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్.. బీజేపీకి నిధులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. అది కూడా కర్ణాటకలో కావడం గమనార్హం. కర్ణాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆమె బెదిరించారని, బీజేపీకి ఎన్నికల విరాళాలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.
ఈ విషయాన్ని సామాజిక ఉద్యమ సంస్థ `జనాధికార సంఘర్ష పరిషత్తు`కు చెందిన ఆదర్శ్ అయ్యర్ వెలు గులోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు, గతంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమ యంలో బీజేపీకి ఆర్థికంగా వనరులు సమీకరించేందుకు నిర్మలా సీతారామన్ ప్రయత్నించారని, ఈ క్రమంలో పారిశ్రామిక వేత్తలను ఆమె బెదిరించారన్నది అయ్యర్ ఆరోపణ. దీనికి సంబంధించిన ఆధారా లను కూడా ఆయన వెలుగులోకి తీసుకుచ్చారు.
అయితే.. ఈ ఆధారాలను బహిర్గతం చేయకుండా పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయాలని కోరారు. కానీ, బెంగళూరులోని తిలక్‌నగర పోలీసు స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసేందుకు తిరస్కరిం చారు. ఈ విషయంపై బెంగళూరు పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో నేరుగా ఆదర్శ్ అయ్యర్ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తక్షణమే నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
దీంతో నిర్మలమ్మ చేసిన పని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అయితే.. ఈ వ్యవహారంపై ఇటు బీజేపీ కానీ, అటు సీతారామన్ కానీ.. ఇప్పటి వరకు స్పందించ లేదు. ఎఫ్ ఐఆర్ నమోదు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకునే అవకాశం ఉంది. పైగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.