Begin typing your search above and press return to search.

సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా...లుక్ అవుట్ నోటీసులు జారీ!

సజ్జల భార్గవ్ రెడ్డి విదేశాలకు పారిపోతారు అన్న అనుమానంతోనే ఈ లుకౌట్ నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Nov 2024 3:45 PM GMT
సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా...లుక్ అవుట్ నోటీసులు జారీ!
X

వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని చెబుతున్నాయి. సజ్జల భార్గవ్ రెడ్డి మీద ఈ నెల 8నే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేసిన పోలీసులు ఇపుడు లేటెస్ట్ గా ఆయన విదేశాలకు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

సజ్జల భార్గవ్ రెడ్డి విదేశాలకు పారిపోతారు అన్న అనుమానంతోనే ఈ లుకౌట్ నోటీసులు ఇచ్చారని అంటున్నారు. ఆయన కోసం గాలింపు చర్యలను కూడా ప్రారంభించారు. అసలు సజ్జల భార్గవ్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతోనే సజ్జల భార్గవ్ రెడ్డి విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు అని అంటున్నారు.

ఇక సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జిగా వ్యవహరించారు. దాంతో ఆయనతో పాటుగా వైసీపీ సోషల్ మీడియాలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్న అర్జున్ రెడ్డి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అర్జున్ రెడ్డి జగన్ కి దగ్గర బంధువుగా ఉన్నారు.

ఇక సజ్జల భార్గవ్ రెడ్డి దేశం విడిచి పోకుండా కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక సజ్జల భార్గవ్ రెడ్డి మీద వైఎస్సార్ జిల్లాకు చెందిన హరి అన్న దళితుడి ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు పెట్టారు.

సోషల్ మీడియా పోస్టుల మీద ప్రశ్నించినందుకే తనను కులం పేరుతో దూషించారు అని హరి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇక జగన్ వ్యతిరేక నేతల మీద సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడంలో సజ్జల భార్గవ్ రెడ్డిదే కీలక పాత్ర అని వర్రా రవీంద్రరెడ్డి వాంగ్మూలంలో చెప్పిన దాని మేరకు భార్గవ్ రెడ్డి మీద ఉచ్చు బిగించారు అని అంటున్నారు.

ఇక భార్గవ్ రెడ్డి మీద ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయని ఇపుడు ఏకంగా ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులో మరింతగా ఉచ్చు బిగుస్తొందని అంటున్నారు. దాంతో ఆయన దేశం విడిచి పోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు అని అంటున్నారు.

ఇక సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం స్పెషల్ పోలీస్ టీములు రంగంలోకి దిగాయని అంటున్నారు. గత అయిదేళ్ళుగా టీడీపీ జనసేన నాయకులను వారి కుటుంబాలను టార్గెట్ చేసినందుకు గానూ భార్గవ్ రెడ్డి మీద కేసులు పెట్టి అరెస్ట్ దిశగా వ్యవహారం మొత్తం నడిపించేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నారు.

సజ్జల భార్గవ్ రెడ్డి దాకా వచ్చిందంటే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో అరెస్టులు పీక్స్ కి చేరినట్లే అని అంటున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా ఇంటూరి రవి కిరణ్ సతీమణి ఇంటూరి సుజనని జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెబుతున్నారు.

సోషల్ మీడియా యాక్టివిస్టులను వరసబెట్టి అరెస్ట్ చేయడంతో పాటు కొందరిని ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్ కి తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. తన భర్త ఇంటూరి రవి కిరణ్ ని అక్టోబర్ 21న అరెస్ట్ చేశారని ఆయన సతీమణి సుజన చెబుతూ ఆయనని చిత్ర హింసలు పెడుతున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తన భర్త మీద తొమ్మిది కేసులు పెట్టారని తాను దీని మీద ప్రైవేట్ కేసు పెడతానని ఆమె అన్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ తో ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉందని అంటున్నారు.