విజయసాయికి సీబీఐ షాక్

వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలన్న విజయసాయి అభ్యర్థనను తోసిపుచ్చింది.

Update: 2025-01-28 07:14 GMT

వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలన్న విజయసాయి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో వచ్చే నెల 10 నుంచి మార్చి 10 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్న మాజీ ఎంపీ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. వచ్చే నెల 10 నుంచి నెల రోజుల పాటు నార్వే దేశానికి వెళ్లాల్సివున్నందున అనుమతి ఇవ్వాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనికి కౌంటర్ వేసిన సీబీఐ తమకు అభ్యంతరాలు ఉన్నట్లు తెలియజేసింది.

అయితే ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి తరఫు న్యాదవాదులు తెలిపారు. అదేవిధంగా ట్రయల్ కోర్టు కూడా విజయసాయి విదేశీపర్యటనకు అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

కాగా, రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఈ నెల 24న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 25న ఆయన రాజీనామా చేయగా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ వెనువెంటనే ఆమోదించారు. ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భావించిన విజయసాయి నెలరోజుల పాటు విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటానని, అందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.

Tags:    

Similar News