కోల్ కతా కామపిశాచికి కించిత్ పశ్చాత్తాపం కూడా లేదట

యావత్ దేశాన్ని కుదిపేసి.. విన్నంతనే వికారంగా అనిపించే దుర్మార్గ ఘటనగా కోల్ కతా వైద్యవిద్యార్థిని హత్యాచారాన్ని చెప్పాలి.

Update: 2024-08-23 04:23 GMT

యావత్ దేశాన్ని కుదిపేసి.. విన్నంతనే వికారంగా అనిపించే దుర్మార్గ ఘటనగా కోల్ కతా వైద్యవిద్యార్థిని హత్యాచారాన్ని చెప్పాలి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ వేగంగా విచారణ జరుపుతోంది. అంతేకాదు.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సంజయ్ రాయ్ ను అధికారులు విచారిస్తున్నారు. పట్టుబడిన రోజు నుంచి విచారణకు సహకరించక పోవటం ఒక ఎత్తు.. ఉరి తీస్తారా? తీసేయండంటూ సవాలు విసరటం మరో ఎత్తు. అలాంటి కామపిశాచికి తగిన రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకోవటమే అసలు విషయంగా చెప్పాలి.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ప్రధాన నిందితుడ్ని విచారిస్తోంది. అంతేకాదు.. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు చెందిన మెడికల్ టీం కూడా ఆ నిందితుడి మానసిక పరిస్థితిని విశ్లేషించింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని వారు వెల్లడిస్తున్నారు. అశ్లీల చిత్రాలకు బానిసగా మారాడని.. ఏ మాత్రం మంచి బుద్ధి లేదని పేర్కొంటున్నారు. అతడిలో పశు ప్రవ్రత్తి కనిపించిందన్న మాటను వారు చెబుతున్నారు.

అన్నింటికి మించి ఇంత జరిగిన తర్వాత కూడా తాను చేసిన దారుణం పైన ఎలాంటి పశ్చాత్తాపం లేదంటున్నారు. అంతేకాదు.. తాను చేసిన దారుణానికి సంబంధించిన ప్రతి నిమిషాన్ని మిస్ కాకుండా గుక్క తిప్పుకోకుండా వివరించిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. అతడు చెప్పిన తీరును చూసిన తర్వాత.. అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నట్లుగా కనిపించిన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పటానికి అవసరమైన సాంకేతిక ఆధారాలు లభించినట్లుగా చెబుతున్నారు. అయితే.. నిఘా విభాగం కానీ.. మిగిలిన విచారణ అధికారులు ఎవరూ కూడా.. ఈ దారుణ హత్యాచారంలోని కొత్త అంశాల్ని వెలుగు చూపిస్తున్న వైపు ఫోకస్ చేయకపోవటం గమనార్హం. అంతేకాదు.. ఇది గ్యాంగ్ రేప్ అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పుడు.. ఆ దిశగా ఇప్పటికి అడుగులు పడకపోవటం దేనికి నిదర్శనం? అన్న మాట వినిపిస్తోంది. మరిప్పటికైనా రియాక్టు అవుతారేమో చూడాలి.

Tags:    

Similar News