లక్ష అంటున్న బాబు....ఓకేనా....!?

ఇపుడు బాబు మరోమారు లక్ష అంటున్నారు. మరి ఈసారి లక్ష వెనక కధ ఏంటి అంటే అక్కడే ఉంది మజా. చంద్రబాబు సొంత సీటు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ కావాలని అంటున్నారు.

Update: 2023-12-14 02:45 GMT

టీడీపీ అధినేత టార్గెట్లు ఎపుడూ పెద్దవే. ఆయన అంచనాలు గట్టిగానే ఉంటాయి. ఆయన పరిశ్రమ కూడా అలాగే ఉంటుందనుకోండి. అది వేరే సంగతి. కానీ ఇపుడు చంద్రబాబు లక్ష అని అంటున్నారు. అప్పట్లో ఎపుడో ఆయన నోటి వెంట లక్ష కోట్లు అని ప్రత్యర్ధి మీద ఆరోపణలు వినిపిస్తూ ఉండేవి.

ఇపుడు బాబు మరోమారు లక్ష అంటున్నారు. మరి ఈసారి లక్ష వెనక కధ ఏంటి అంటే అక్కడే ఉంది మజా. చంద్రబాబు సొంత సీటు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ కావాలని అంటున్నారు. ఏపీలో లక్ష ఓట్లు ఒక అసెంబ్లీ అభ్యర్ధికి వచ్చిన వైనం అయితే ఇప్పటిదాకా లేదు. అదే తెలంగాణాలో అయితే ఆ రేర్ ఫీట్ ని 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సాధించారు. అయితే ఈసారి ఆయన మెజారిటీ ఎనభై వేలకు పడిపోయింది.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో జగన్ మెజారిటీ తొంబై వేల పై చిలుకు దాటేసింది. అయిన లక్షకు దగ్గరగా వచ్చారు కానీ లక్ష ఓట్ల మెజారిటీ మాత్రం తెచ్చుకోలేదు. కానీ చంద్రబాబుకు అదే టైం లో కుప్పంలో మెజారిటీ 30 వేలకు పడిపోయింది. ఇక చంద్రబాబు అనేక సార్లు కుప్పం నుంచి గెలిచినా ఆయన మెజారిటీ హయ్యేస్ట్ ఎపుడూ అరవై వేలను మించి లేదు.

కానీ ఈసారి మాత్రం తన మెజారిటీ లక్ష ఉండాలని బాబు ఒక గట్టి టార్గెట్ పెట్టేశారు. చంద్రబాబు మంగళగిరి పార్టీ ఆఫీసుకు వచ్చారని తెలిసి కుప్పం నుంచి టీడీపీ నేతలు ఆయన్ని కలవాలని వచ్చారు. కుప్పం ఇంచార్జిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ని బాబు నియమించిన సంగతి తెలిసిందే.

ఆయనతో బాబు అనేక విషయాలు చర్చించారు. అదే విధంగా పార్టీ క్యాడర్ కి ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈసారి మెజారిటీ అదిరిపోవాలంతే అన్నట్లుగా మాట్లాడారు. మరి చంద్రబాబు మెజారిటీ లక్ష ఉంటుందా అన్నది ఇపుడు చర్చనీయాంశగా ఉంది.

మరో వైపు చూస్తే కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని వైసీపీ సవాల్ చేస్తోంది. అయితే బాబు జైలు ముందు ఉన్న పరిస్థితి ఇపుడు లేదని, ఒక్కసారిగా మారిందని, సానుభూతి క్రియేట్ అయిందని అంటున్నారు. దాంతో బాబు గెలుపు ఆశలు ఇంకా పెరగడమే కాదు కుప్పం నుంచి లక్ష ఓట్ల మెజారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు అంటే బాబు కుప్పం మీద పెట్టిన భారం ఏ రేంజిలో ఉందో చూడాల్సిందే. ఏది ఏమైనా బాబు లక్ష అంటే క్యాడర్ మరి ఈ రోజు నుంచి గ్రౌండ్ లోకి దూకేయడమే అంటున్నారు అంతా.

Tags:    

Similar News