ఓటీటీ, ఆన్ లైన్ కంటెంట్ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం!

ఈ నూతన బ్రాడ్ కాస్టింగ్ బిల్లు ద్వారా వాక్ స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందనే అభిప్రాయాలు కంటెంట్ క్రియేటర్స్ నుంచి బలంగా వినిపించాయి.

Update: 2024-08-13 09:38 GMT

ఇటీవల నూతన బ్రాడ్ కాస్టింగ్ బిల్లును కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బిల్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... బిల్లు ముసాయిదాను వెనక్కి తీసుకుంది! ఈ బిల్లు ద్వారా ఆన్ లైన్ కంటెంట్ పై నియంతృత్వ ధోరణితో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందంటూ విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అవును... ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన నూతన బ్రాడ్ కాస్టింగ్ బిల్లు ముసాయిదాను వెనక్కు తీసుకుంది. ఈ బిల్లుతో ఆన్ లైన్ కంటెంట్ పై కేంద్రం నియంతృత్వ ధోరణితో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో విపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. దీంతో... ఈ బిల్లు ఇషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ నూతన బ్రాడ్ కాస్టింగ్ బిల్లు ద్వారా వాక్ స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందనే అభిప్రాయాలు కంటెంట్ క్రియేటర్స్ నుంచి బలంగా వినిపించాయి. దీంతో.. వెనక్కి తగ్గిన కేంద్రం ఈ బిల్లులో పలు నిబంధనలను పునఃసమీక్షించి, సవరణ చేసి తిరిగి పార్లమెంట్ ముందుకు తీసుకొస్తామని తెలిపింది!

కాగా... 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్స్ పోషించిన కీలక పాత్రను దృష్టిలో పెట్టుకొని వారి గొంతు నెక్కేలా కేంద్రం ఈ ముసాయిదా బిల్లును రూపొదించిందనే విమర్శలు బలంగా వినిపించాయి. ఈ సమయంలో... బ్రాడ్ కాస్టింగ్ సంస్థలతో జర్పిన క్లోజ్డ్ డోర్ చర్చలు కాకుండా.. పౌర సంఘాలతో చర్చలు జరపాలని డిజిటల్ మీడియా సంస్థలు కోరాయి.

ఈ నేపథ్యంలో... ఈసారి బ్రాడ్ కాస్టింగ్ సంస్థలతోనే కాకుండా బ్రాడ్ కాస్టింగ్ సేవలతో ముడిపడిన అన్ని వర్గాలతోనూ చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అలాకాని పక్షంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశాలున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News