బీజేపీలోకి చంపయీ...ఎవరి కొంప ముంచెన్ ?

అపుడు ఎలాంటి తేడా పాడా రాలేదు. కానీ హేమంత్ సోరెన్ కేసు విషయంలో జైలుకు వెళ్ళి చంపయీని సీఎం ని చేశాక మాత్రమే ఆ తేడా వచ్చింది.

Update: 2024-08-31 03:45 GMT

చంపయీ సోరెన్ నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన జార్ఖండ్ ముక్తీ మోర్చా వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ సమకాలీనుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఆయన అదే భావంతో శిబూ సోరెన్ రెండవ కుమారుడు అయిన హేమంత్ సోరేన్ నాయకత్వంలోనూ జేఎంఎం లో పనిచేశారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయితే ఈయన మంత్రిగా ఉన్నారు.

అపుడు ఎలాంటి తేడా పాడా రాలేదు. కానీ హేమంత్ సోరెన్ కేసు విషయంలో జైలుకు వెళ్ళి చంపయీని సీఎం ని చేశాక మాత్రమే ఆ తేడా వచ్చింది. ముఖ్యమంత్రి పదవి రుచి అలాంటిది అంటారు. హేమంత్ సోరేన్ తిరిగి వచ్చి తప్పుకోమని చంపయీని కోరడంతో ఆయన నొచ్చుకున్నారు.

నిజానికి ఆ సీటు ఆయనది కాదు, హేమంత్ ది అని తెలిసి కూర్చున్నారు తిరిగి దిగిపోయేటప్పటికి తెగ బాధపడిపోయారు. అదే ఆయనను ఏకంగా శిబూ ఫ్యామిలీకే దూరం చేసింది. జేఎంఎం పార్టీకే గుడ్ బై కొట్టేలా చేసింది. ఆయనలో ఆ అసంతృప్తిని బీజేపీ గ్రహించి సొమ్ము చేసుకుంది.

ఆయనను తమ వైపు ఆకర్షించి కమల తీర్ధం ఇప్పించింది. అలా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమం కూడా అంగరంగం వైభవంగా జరిగినిద్. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో చంపయీ సోరెన్ బీజేపీలో చేరిపోయారు.

అయితే బీజేపీలో ఎందుకు చేరారు అన్న దానికి చంపయీ సోరెన్ దగ్గర జవాబు ఉంది. తనపై ఝార్ఖండ్ ప్రభుత్వం నిఘా పెట్టిన తర్వాత బీజేపీలో చేరాలనే తన సంకల్పం బలపడిందని చంపయీ సోరెన్ అంటున్నారు. తాను వేదనను గురి అయ్యానని చెబుతున్నారు. అందుకే ఎంతో ఆలోచించిన మీదటనే బీజేపీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ మాత్రమే అడవి బిడ్డల హక్కులను కాపాడుతుందని పేర్కొన్నారు.

తాను ఇక గిరిజనుల తరఫున పోరాడుతానని తెలిపారు. తనకు పార్టీ అప్పగించే బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని వివరించారు. చంపయీ సోరెన్ జేఎంఎం పార్టీకి ఒక పెద్ద అండ. మరి ఆయన పార్టీ మారాక ఆ ప్రభావం ఉంటుందా. ఆయన తన బలాన్ని బీజేపీ వైపు మళ్ళించగలరా ఆయన జేఎంఎం కొంప ముంచగలరా అన్నది చర్చగా ఉంది.

జార్ఖండులో బీజేపీకి సొంతంగా బలం ఉంది. రాష్ట్ర ఏర్పడ్డాక బీజేపీ ఎక్కువ కాలమే పాలించింది. ఇపుడు ఆ పార్టీ జేఎంఎంలో చీలిక వచ్చి చంపయీ తోడు దొరికాడు అయిదేళ్ళ పాలన తరువాత హేమంత్ సోరెన్ సర్కార్ మీద వ్యతిరేకత ఎటూ ఉంటుంది. దాంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కమలనాధులు అంటున్నారు.

అదే నిజం అనుకున్నా బీజేపీలో చేరిన తరువాత కూడా చంపయీకి సీఎం ఇస్తారా అన్నదే చూడాలి. కానీ బీజేపీ అలా ఇవ్వదనే అంటున్నరు. ఏది ఏమైనా చంపయీ కొంప ముంచే పావు గానే ఉంటారు తప్ప మళ్లీ సీఎం సీటు ఎక్కేది ఉండదని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News