అప్పుడు బిల్ గేట్స్.. ఇప్పుడు శామ్ ఆల్ట్ మన్.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్

అవును, మీ సందేహానికి సమాధానం ముఖ్యమంత్రి చంద్రబాబే. దేశంలోని ఏ పొలిటీషయన్ స్పందించని విధంగా ఆల్డ్ మన్ ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు.;

Update: 2025-04-03 16:33 GMT
అప్పుడు బిల్ గేట్స్.. ఇప్పుడు శామ్ ఆల్ట్ మన్.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్

గత ఏడాది నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తాను 1995 సీఎంగా పనిచేస్తానని, అంతా తనతో పోటీ పడాలని పిలుపునిచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆయన యాక్షన్ చూస్తుంటే బాబు తన మాట నిలబెట్టుకున్నట్లే కనిపిస్తున్నారు. అప్పుడెప్పుడో తెలుగువారు ఎవరూ ఊహించని విధంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను ఉమ్మడి ఏపీకి తెచ్చి హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు ఏపీని ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని చూస్తున్న చంద్రబాబు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

ప్రపంచ ఏఐ దిగ్గజం, ఓపెన్ ఏఐ కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్ మన్ కోసం సాధారణ ప్రజానీకానికి ఎవరికీ తెలియదు. కానీ, టెక్ వరల్డ్ లో ఆల్ట్ మన్ కోసం తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆల్ట్ మన్ భారత్ లో ఏఐ విస్తరిస్తున్న తీరుపై అమితాసక్తి కనబరిచారు. ఏఐని వినియోగించుకుని భారత్ లో జరుగుతున్న పరిణామాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ తరహా క్రియేటివిటీ అద్భుతంగా ఉంది. ఏఐ వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తోంది” అంటూ ఆల్ట్ మన్ తన సోషల్ అకౌంటులో ట్వీట్ చేశారు. ఆయన పోస్టుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది టెకీలు రీ ట్వీట్ చేశారు. కానీ, భారత్ లో ఓ అనూహ్య వ్యక్తి కూడా స్పందించారు. ఏఐలో సత్తా చాటుతున్న ఆల్ట్ మన్ ను భారత్ కు అందులోనూ ప్రత్యేకంగా ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంటే ఆ అనూహ్య వ్యక్తి ఎవరో ఇప్పటికే అర్థం అయిపోయివుంటుంది కదా..

అవును, మీ సందేహానికి సమాధానం ముఖ్యమంత్రి చంద్రబాబే. దేశంలోని ఏ పొలిటీషయన్ స్పందించని విధంగా ఆల్డ్ మన్ ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు. గురువారం కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఆల్ట్ మన్ పోస్టును చూసిన చంద్రబాబు వెంటనే రీ ట్వీట్ చేశారు. ‘‘మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజం. ఏఐ భారత్ లో ఇప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో భారతులోని ఆంధ్రప్రదేశ్ ఏఐ పురోగతిలో వేగంగా ముందుకు సాగుతోంది. దేశంలోనే ఏఐకి కేంద్రంగా మారబోతోంది. ఈ దఫా మీరు భారత్ కు వస్తే తప్పనిసరిగా ఏపీలో పర్యటించండి. ఏఐలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దానిని తాము ఎలా తీర్చిదిద్దబోతున్నామన్న విషయంపై చర్చిద్దాం. ఏపీకి ఒక్క ఏఐకి మాత్రమే పరిమితం కావడం లేదు. క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకోడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అంటూ చంద్రబాబు రిప్లై ఇచ్చారు.

ఆల్ట్ మన్ ట్వీట్ కు చంద్రబాబు రీట్వీట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్న చంద్రబాబు ప్రపంచ దిగ్గజాలను ఆకర్షించేందుకు ఎంతలా కష్టపడతారో ఇదే నిదర్శనమంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టెక్ వరల్డ్ లో తప్ప, మిగతా ప్రపంచానికి అంతగా పరిచయం లేని ఏఐ దిగ్గజాన్ని గుర్తించి రాష్ట్రానికి ఆహ్వానించడం చూస్తే.. 1995 రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయంటున్నారు.

Tags:    

Similar News