జ్యూరిచ్ లో కలిసిన చంద్రబాబు - రేవంత్... వీడియో వైరల్!

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో మొదలు కానున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-20 07:50 GMT

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఈ నెల 24 వరకూ కొనసాగనుంది. ఈ సదస్సు కోసం ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, అనేక రంగాల ప్రముఖులు వస్తున్నారు. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు జ్యురిచ్ చేరుకుని.. కలుసుకున్నారు.

అవును... ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ దిగ్గజాలు పాల్గొనే దావోస్ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు "బ్రాండ్ ఏపీ" ప్రయత్నంలో భాగంగా బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో ఆయన జ్యూరిచ్ చేరుకున్నారు. ఈ సమయంలో బాబుతో పాటు లోకేష్, రామ్మోహన్ నాయుడు, అధికారులు ఉన్నారు.

ఇదే సమయంలో... ఇప్పటికే సింగపూర్ పర్యటనలో భాగంగా... తెలంగాణకు రూ.450 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఓ భారీ ప్రాజెక్టును తీసుకురావడంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి.. అదే ఉత్సాహంతో దావోస్ బయలు దేరారు. ఈ సమయంలో తాజాగా ఆయన కూడా తన టీం తో జ్యూరిచ్ చేరుకున్నారు.

ఈ సమయంలో... ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యూరిచ్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు బృందాన్ని.. విమానాశ్రయంలో తెలంగాణ సీఎం రేవంత్ బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది.. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.

ఇదే సమయంలో... విమానం దిగి బయటకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు అక్కడున్న తెలుగువారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారందరితోనూ కరచాలనం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడిన బాబు వారితో ఫోటోలు దిగారు. మరోపక్క లోకేష్ తో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఈ వీడియోను టీడీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

Tags:    

Similar News