వెంకటేశ్వరస్వామి కాపాడిన ప్రాణం.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

అంత కంటే ముందు తిరుమల ఘాట్ రోడ్ లో క్లైమోర్ మైన్స్ తో జరిగిన దాడిని గుర్తు చేసుకుంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-20 08:35 GMT

ఏపీ శాసనసభలో ముఖమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో పలు అక్రమాలు జరిగాయని చెబుతూ, తమ కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు 53 రోజుల జైలు జీవితం, అంత కంటే ముందు తిరుమల ఘాట్ రోడ్ లో క్లైమోర్ మైన్స్ తో జరిగిన దాడిని గుర్తు చేసుకుంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలనలో జరిగిన అక్రమాలను ఎంత తవ్వితే అంత భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

ఈ నేపథ్యలోనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలమనే నమ్మకం ఉందా? అని కొంతమంది అడిగారని.. అయితే, తాను పారిపోను.. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పనిచేశానని.. ఇప్పుడు కూడా ఇలంటి సవాల్ ను స్వీకరించి మళ్లీ ప్రజలను నిలబెడతానని చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు.

తనను గత నాలుగు దశాబ్ధాలుగా ప్రజలు ఆదరించారని.. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని.. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిలా నేర్చుకున్నానని చంద్రబాబు తెలిపారు. తాను ఎన్నో కష్టాలు పడ్డానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. ఈ సభలోనే తన కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... 24 క్లైమోర్ మైన్స్ తో దాడి చేస్తే వెంకటేశ్వరస్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారని.. ఈ సభలోనే తన కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారని.. తాను ఏ తప్పూ చేయలేదని.. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రపంచదేశాల్లోని తెలుగువారు రోడ్డుపైకి వచ్చి పోరాడారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

ఇక.. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు... ఇది ఎంతో అరుదైన అనుభవమని.. తనపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఈ బాధ్యతను అప్పగించారని.. తనకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదని.. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ కేంద్రంలో ఎన్నోసార్లు కీలా పాత్ర పోషించిందని అన్నారు.

Tags:    

Similar News