లడ్డు ఇష్యూ తరువాత ఫస్ట్ టైం ఢిల్లీకి బాబు
ఏపీలో సెప్టెంబర్ నెల మధ్య నుంచి శ్రీవారి లడ్డూ ఇష్యూ ఎంతటి సంచలనం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిందో అందరికీ తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 7న చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో రాజకీయ వర్గాలలో అది అత్యంత ఆసక్తిగా మారుతోంది. ఎందుకంటే లడ్డు ఇష్యూ తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఏపీలో సెప్టెంబర్ నెల మధ్య నుంచి శ్రీవారి లడ్డూ ఇష్యూ ఎంతటి సంచలనం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిందో అందరికీ తెలిసిందే.
హిందూత్వ నినాదంతో దశాబ్దాలుగా ముందుకు సాగుతున్న బీజేపీ కంటే కూడా టీడీపీ జనసేన ఈ విషయంలో దూకుడు చేశాయి. అదే సమయంలో చంద్రబాబు పలు మార్లు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలసింది అని మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
ఈ పరిణామంతో కోట్లాదిమంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక ఇదే సమయంలో ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్ళడం లడ్డూ కల్తీ మీద ఆధారాలు ఉన్నాయా అంటూ అత్యున్నత న్యాయ స్థానం ఏపీ ముఖ్యమంత్రి వైఖరి మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం విధితమే. ఒక సీనియర్ నేతగా ఎన్డీయేలో ముఖ్య భాగస్వామిగా ఉన్న బాబు లడ్డూ విషయమో ఇరుకున పడ్డారు అని కూడా ప్రచారం సాగింది.
ఈ మొత్తం క్రమంలో బాబు ఢిల్లీ టూర్ ఇపుడు ఆసక్తిని పెంచుతోంది. ఢిల్లీలో బాబు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలవబోతున్నారు.ఆయన ఏపీకి సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావిస్తారు అని తెలుస్తోంది. అలాగే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలసి విశాఖ రైల్వే జోన్ కి తొందరగా శంకుస్థాపన చేసే అంశాన్ని కూడా చర్చిస్తారు అని అంటున్నారు.
అయితే చంద్రబాబు లడ్డూ వివాదం గురించి కూడా కేంద్ర పెద్దలకు వివరిస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ఏపీలో విపక్ష వైసీపీ విషయంలో చేస్తున్న రాజకీయ పోరాటం గురించి వివరించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
చంద్రబాబు కేంద్ర పెద్దలతో ఈ విషయం మీద పూర్తిగా అన్నీ చెబుతారు అని అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే జాతీయ స్థాయిలో చంద్రబాబు పొలిటికల్ గా బిగ్ ఫిగర్ గా ఉన్నారు. ఆయన ఢిల్లీ ఎపుడు వెళ్ళినా మీడియాతో మీట్ ఉంటుంది. ఈసారి మీడియా కూడా బాబు కోసం కాచుకుని ఉంటుంది. మరి మీడియాకు బాబు లడ్డూ ఇష్యూ మీద ఏమి చెబుతారు అన్నది కూడా చర్చగా ఉంది.
ఇక కీలక మిత్రుడు అయిన బాబు లడ్డూ ఇష్యూతో ఇబ్బంది పడిన తరువాత కేంద్ర బీజేపీ వైఖరి ఎలా ఉంటుంది. ఆయనకు భరోసా ఇచ్చి కలుపుకుని ముందుకు తీసుకుని వెళ్తారా లేక దీనిని పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా తీసూంటారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే మిత్రులు వీక్ అయినపుడు కానీ ఇరకాటంలో పడినపుడు కానీ బీజేపీ వారిని మరింత తనకు అనుకూలంగా చేసుకోవడమే కమలం పార్టీ గతంలో ఎక్కువగా చేసిన దాఖలాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఈసారి రాజకీయ అంశాల మీద చర్చలే ఎక్కువగా ఉండవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.