చంద్రబాబు వన్ అండ్ ఓన్లీ !

అయితే ఆశ్చర్యమేంటి అంటే అక్కడ అందరి కంటే వయసులో పెద్ద వారు అయిన చంద్రబాబు ఏపీలో ఎలా ఉంటారో అదే డ్రెస్ కోడ్ తో ఉండడం.

Update: 2025-01-21 07:26 GMT

అదేదో సినిమాలో భానుమతి సింగిల్ పీస్ అని ఒక హీరోయిన్ కారెక్టర్ అంటుంది. అలా దేశంలోని రాజకీయ నాయకులలో వన్ అండ్ ఓన్లీ చంద్రబాబే అని చెప్పాలి. ఆయనకు ఏజ్ లేదు, ఆయన దూకుడుకు అడ్డు లేదు, ఆయన విజన్ ఎవరికీ అందనంత ఎత్తు. ఇలా ఎన్నో ప్లస్ పాయింట్స్ చంద్రబాబుని చూస్తే చెప్పాలనిపిస్తుంది. చంద్రబాబు వయసుని జయించిన మొనగాడు అని మరోసారి రుజువు అయింది.

ఆయన దావోస్ టూర్ లో భాగంగా తన టీం తో కలసి మొదట జ్యూరిచ్ చేరుకున్నారు. అక్కడ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ వంటి వారు ఉన్నారు. బాబు వెంట నారా లోకేష్ టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇక వీరంతా జ్యూరిచ్ ఎయిర్ పోర్టు వెయింటింగ్ లాంజ్ లో కలిశారు.

అయితే ఆశ్చర్యమేంటి అంటే అక్కడ అందరి కంటే వయసులో పెద్ద వారు అయిన చంద్రబాబు ఏపీలో ఎలా ఉంటారో అదే డ్రెస్ కోడ్ తో ఉండడం. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. దాంతో మిగిలిన వారు అంతా స్వెట్టర్లు జర్కిన్లు వేసుకున్నారు. మైనస్ డిగ్రీల సెల్సియస్ ని సైతం తట్టుకునేలా వారంతా కట్టుదిట్టమైన స్వెట్టర్లు ధరించారు.

కానీ ఒక్క చంద్రబాబు మాత్రం ఏపీలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా అక్కడా ఉన్నారు. పైగా ఆయన ఎంతో హుషారుగా ఉల్లాసంగా కనిపించారు. ఆయన అక్కడ వాతావరణానికి కానీ చలికి కానీ ఏ మాత్రం ఇబ్బంది పడలేదు సరికదా కనీసం మెడలో మఫ్లర్ కూడా వేసుకోలేదు.

దాంతో ఈ ఫోటోలను చూసిన వారు బాబు అంటే అందరి కంటే పెద్ద వారు కాదు ఆయన చెప్పినట్లుగానే పాతికేళ్ళ వారే అని అంటున్నారు. అవును బాబు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆయన ఈ రోజుకు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. అయినా కానీ ఆయన ఆహార నియమాలు చాలా పద్ధతిగా పాటిస్తారు.

ఆయన అన్నం అన్న పదార్ధం జోలికే పోరు అంటారు. అంతే కాదు నూనె పదార్ధాల వైపు కన్నెత్తి చూడరు, చక్కెర అంటే చేదు అన్నట్లుగా ఉంటారు. చాలా తక్కువగా తింటారు. అది కూడా సమయానికి తీసుకుంటారు. అందుకే బాబు అంత ఆరోగ్యంగా ఉన్నారని చెబుతారు.

ఆయన ప్రపంచం నలుమూలలా గ్లోబ్ మొత్తం తిరిగినా తన డ్రెస్ కోడ్ ని మార్చరు. ఏ దేశంలో అయినా అక్కడి వాతావరణంతో ఆయన పూర్తిగా అడ్జస్టు అవుతున్నారు అంటే నిజంగా బాబు గ్రేట్ అనే చెప్పాలి. బాబు పట్టుదల ఆయన ఆరోగ్య నియమాలు ఆయన ఆలోచనలు ఇవన్నీ కేవలం రాజకీయ రంగంలో ఉండే వారికే కాదు మొత్తం యువతరానికి ఎంతో స్పూర్తి అంటే అందులో అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News