డాక్టర్ బాబు...ఆ మూడూ మానేస్తే మీ ఆరోగ్యం మీదే !

చంద్రబాబులో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయన కార్పోరేట్ సీఈవోగా రూల్ అంటే రూల్ అని చెప్పగలరు.;

Update: 2025-04-08 03:02 GMT
డాక్టర్ బాబు...ఆ మూడూ మానేస్తే మీ ఆరోగ్యం మీదే !

చంద్రబాబులో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయన కార్పోరేట్ సీఈవోగా రూల్ అంటే రూల్ అని చెప్పగలరు. సంస్కరణవాదిగానూ నిలిచి మాట్లాడగలరు. పేదలంటే ఎంత ప్రేమ ఉందో వారి వంటింటికి వెళ్ళి మరీ టీ కాచి ఇవ్వగలరు. సామాజిక నిపుణుడిగా మారి పిల్లలను ఎక్కువగా కనకపోతే సమాజం ఏమి అవుతుందో ఆందోళను వ్యక్తం చేయగలరు

ఇల లేటెస్ట్ గా బాబు డాక్టర్ బాబు అవతారం ఎత్తారు. అది కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ ఆయన పవర్ ఫుల్ గా పవర్ పాయింట్ ప్రజంటేషన్ అమరావతిలోని సచివాలయంలో ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ హెల్త్ ఇండెక్స్ ని కూడా చెప్పారు. ఎవరికి ఎక్కువ ఏ ఆరోగ్య సమస్య ఉందో కూడా విడమరచి చెప్పారు.

ఇక ఎవరు ఎంత తింటే ఆరోగ్యంగా ఉంటారో కూడా చెప్పారు. ప్రతీ కుటుంబం నెలకు ఆరు వందల గ్రాముల ఉప్పు, మూడు కేజీల పంచదార, రెండు లీటర్లు ఆయిల్ వాడితే వారికి ఏ రకమైన వ్యాధులు దరిచేరవని భరోసా ఇచ్చారు. కానీ ఈ మోతాదు కన్నా ఎక్కువ వాడడం వల్లనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక చూస్తే కనుక ఏపీలో ఎక్కువగా గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ శ్వాస కోశ వ్యాధులు పెరుగుతున్నాయని బాబు చెప్పారు. ఫలితంగా ప్రతీ కుటుంబానికీ రాష్ట్రంలో వైద్య ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయాయని ఆయన అన్నారు. ప్రతీ కుటుంబం తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని బాబు కోరారు. అంతే కాదు ప్రాణాయామం చేయాలని తప్పనిసరిగా వ్యాయామం చేయాలని కూడా సూచించారు. ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు యోగా వంటివి సాధన చేస్తే తిరుగు ఉండదని బాబు స్పష్టం చేసారు.

ఇక ఏపీలో ప్రజల కోసం ఆయన వరాలను కూడా ప్రకటించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వంద నుంచి మూడు వందలకు తక్కువ లేకుండా పడకలతో ఆసుపత్రులను తొందరలో ఏర్పాటు చేస్తామని ప్రజల వద్దకే వైద్యాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే అమరావతి రాజధానిలో మెగా మెడికల్ సిటీని నిర్మిస్తామని అన్నారు.

ఈ విధంగా ఏపీ ప్రజలకు వైద్యం ఆరోగ్యం, ఆహారం విషయంలో బాబు ఎన్నో సూచనలు చేసారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన న్యూట్రీ ఫుల్ యాప్ ని ప్రజలు అంతా డౌన్ లోడ్ చేసుకోవాలని బాబు కోరారు. టోటల్ గా బాబు చెప్పేది ఏంటి అంటే ఉప్పు, చక్కెర, నూనెను తగ్గించుకుంటే మీ ఆరోగ్యం మీ చేతులలొనే అని. ఒక డాక్టర్ గా ఆయన మారి చెప్పిన ఈ విషయాలు అయిదు కోట్ల మంది ప్రజలకు ఎతో ఉపయోగకరంగానే ఉన్నాయి.

పైగా బాబు తాను ఆరోగ్య నియమాలను తప్పనిసరిగా పాటిస్తారు కాబట్టే ఈ ఏజ్ లో కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తన ప్రజలను కూడా అలాగే ఉండాలని కోరుకోవడం బాబులోని అభిమానానికి నిదర్శనం అని అంటున్నారు. ఎంతో మంది పాలకులు ఉన్నారు కానీ బాబు మాదిరిగా ఇలా ఇంటి పెద్దగా శ్రేయోభిలాషిగా చెప్పే పాలకుడు మాత్రం ఒక్క బాబు తప్ప ఎవరూ లేరని అంటున్నారు అంతా. దటీజ్ బాబు మరి.

Tags:    

Similar News