సొంత‌కాళ్ల‌పై నిల‌బ‌డాలి.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

ఆయ‌న తన మ‌న‌సులోని మాట‌ల‌ను ఎక్క‌డా దాచుకోరు. చెప్పేస్తారు. కొన్ని కొన్నినేరుగా చెబితే.. మ‌రికొన్నింటిని న‌ర్మ‌గ‌ర్భంగా కుండ‌బ‌ద్ద‌లు కొడ‌తారు.

Update: 2024-10-10 10:30 GMT

సీఎం చంద్ర‌బాబు ఏదైనా ఒక కామెంట్ చేశారంటే.. చాలా అర్థం ఉంటుంది. అస‌లు మీడియాతోనే మాట్లాడ‌ని మాజీ సీఎం జ‌గ‌న్ కంటే.. చంద్ర‌బాబు వంద రెట్లు బెట‌ర్‌. అయితే.. ఆయ‌న తన మ‌న‌సులోని మాట‌ల‌ను ఎక్క‌డా దాచుకోరు. చెప్పేస్తారు. కొన్ని కొన్నినేరుగా చెబితే.. మ‌రికొన్నింటిని న‌ర్మ‌గ‌ర్భంగా కుండ‌బ‌ద్ద‌లు కొడ‌తారు. అదే చంద్ర‌బాబు వెరైటీ. తాజాగా కూడా చంద్ర‌బాబు ఇలానే వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి నిధులు వ‌చ్చే విష‌యంపై స్పందించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స్థానంలోమ‌రెవ‌రైనా ఉండి ఉంటే.. అస‌లు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించేవారు కాదు. కానీ, చంద్ర‌బాబు పైన చెప్పుకొన్న‌ట్టుగా.. ఉన్న‌దిఉన్న‌ట్టు చెప్పేశారు. కానీ, ఇక్క‌డే ఆయ‌న ట్విస్టు ఇచ్చారు. ``ఎవ‌రు ఎంత సాయం చేసినా.. మ‌న కాళ్ల‌పై మ‌నం నిల‌దొక్కుకోవాలి`` అని చెప్పుకొచ్చారు. అంటే.. దీని వెనుక ముందు ఉన్న అర్థం.. కేంద్రంనుంచి అందే సాయం స్వ‌ల్ప‌మేన‌ని చెప్ప‌క‌నే చెప్పుకొచ్చారు. గ‌తంలో మాదిరిగా ఎదురు దాడి చేయ‌కుండా ఆయ‌న చాలా వ్యూహాత్మ‌కంగా వ్యాఖ్యానించారు.

గ‌తంలో ప్ర‌త్యేక హోదా విష‌యంపై మాత్రంముందు వ‌ద్ద‌ని.. త‌ర్వాత కావాల‌ని యాగీ చేసిన విష‌యం తెలిసిందే. ఇది ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రాలు అందించేలా చేసింది. కానీ, ఇప్పుడు మాత్రం చాలా నిర్మాణాత్మ కంగా కేంద్రం త‌ప్పుల‌ను కూడా స‌రిపుచ్చేలా మాట్లాడారు. వాస్త‌వానికి కేంద్రంలో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు ఆశించారు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో కేంద్రం నుంచి ఆశించిన మేర‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు

అలాగ‌ని పేచీ ప‌డే ధోర‌ణి కూడా క‌నిపించ‌డం లేదు. అందుకే మ‌ధ్యేమార్గంగా ఆయ‌న ``మ‌న కాళ్ల‌పై మ‌నం నిల‌బ‌డాలి`` అని ముక్తాయించారు. ఇక‌, విశాఖ ఉక్కు విష‌యాన్ని కూడా కేంద్రం ప‌ట్టించుకోలేదు. ఇది వాస్త‌వం. చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర మంత్రి కుమార స్వామితో భేటీఅయినా.. త‌న చేతుల్లో ఏమీ లేదేని.. అంతా మోడీదేన‌ని తేల్చి చెప్పారు. దీంతో చంద్ర‌బాబు ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడారు. ``మేం చేయాల్సినంతా చేస్తున్నాం. కానీ, విశాఖ ఉక్కు తీవ్ర న‌ష్టాల్లో ఉంది`` అని వ్యాఖ్యానించారు. ఇలా.. కేంద్రం పై క‌నీసం ప‌న్నెత్తు మాట‌కూడా అన‌కుండా.. చంద్ర‌బాబు స‌ర్దుకుపోతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News