వచ్చే సంక్రాతికి మరో గుడ్ న్యూస్... జగన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

తాజాగా అనకాపల్లి జిల్లాలో పర్య్టటించిన చంద్రబాబు... వెన్నెలపాలంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2024-11-02 14:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు హామీలు వచ్చే ఏడాదికి వాయిదా వేసినా.. అవకాశం, ఆర్థిక పరిస్థితులు అనూకూలంగా ఉన్న హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నారు. ఈ సమయంలో వచ్చే సంక్రాతికి ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.

అవును... ఇప్పటికే రూ.1000 పెంచుతూ సామాజిక పెన్షన్స్ అందిస్తున్న చంద్రబాబు.. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల పథకాన్ని ప్రారంభించారు. ఇక ఇప్పుడు బాబు రోడ్లపైనా దృష్టిసారించారు. గత ప్రభుత్వంపై వచ్చిన బలమైన విమర్శల్లో రోడ్ల దుస్థితి కూడ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని, రహదారులు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు.

తాజాగా అనకాపల్లి జిల్లాలో పర్య్టటించిన చంద్రబాబు... వెన్నెలపాలంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన బాబు... గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారిగా మారాయని అన్నారు. ఇదే సమయంలో... గత సీఎం రోడ్లపై స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా... వెన్నలపాలెంలో గుంతలు లేని రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు బాబు తెలిపారు. రహదారులు బాగుంటేనే వ్యాపారాలు బాగా జరుగుతాయని.. వచ్చే సంక్రాంతి లోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని.. 2014-19లో రోడ్లు ఎలా ఉండేవో గుర్తు తెచ్చుకోవాలని బాబు తెలిపారు.

ఈ సందర్భంగా... “రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు లేకుండా చూసే బాధ్యత తమదని.. రాష్ట్రంలో మళ్లీ భూతం రాకుండా చూసే బాధ్యత ప్రజలదని” బాబు వ్యాఖ్యానించారు. గత ముఖ్యమంత్రి రాజధాని పేరు చెప్పి మూడు ముక్కలాట ఆడారని.. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు మాత్రం ఆయనకి మనసు రాలేదని.. రూ.450 కోట్లు పెట్టి రుషికొండలో మాత్రం ప్యాలెస్ కట్టుకున్నారని బాబు మండిపడ్డారు.

Tags:    

Similar News