బాబు బిగ్ స్టెప్... అమరావతి నిర్మాణంలో కీలక అడుగు!

ఇందులో భాగంగా... క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ప్రాజెక్టును పునఃప్రారంభించిన పనులు మొదలవ్వడానికి ఈ రోజు ముహూర్తం ఫిక్స్ చేశారు.

Update: 2024-10-19 05:45 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. అమరావతి ప్రాముఖ్యతను, ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగా... ఏపీలో... 'ఏ' అంటే అమరావతి, 'పీ' అంటే పోలవరం అని బాబు బలంగా నొక్కి చెప్పారు.

దీంతో... ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే విషయం మరింత స్పష్టమైంది. ఈ సమయంలో నేడు తాజాగా మరో కీలక ముందడుగు పడనుంది. ఇందులో భాగంగా... క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ప్రాజెక్టును పునఃప్రారంభించిన పనులు మొదలవ్వడానికి ఈ రోజు ముహూర్తం ఫిక్స్ చేశారు.

అవును... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతికి మంచి రోజులు వచ్చాయని చెబుతున్న నేపథ్యంలో... సీఆర్డీఏ ప్రాజెక్టుకు రాజధాని ప్రాంతంలో పునఃప్రారంభించిన పనులు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి.. ఈ పనుల ప్రారంభంపై ఈ నెల 16న జరిగిన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భేటీలో తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించిన ఏడు అంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదిత ప్రాజెక్టును ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

Tags:    

Similar News