ఆ రెండు పధకాలు కూటమికి సవాల్ ?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి చేసుకున్నా సూపర్ సిక్స్ హామీల విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రావడం లేదు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి చేసుకున్నా సూపర్ సిక్స్ హామీల విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రావడం లేదు. అందులో సామాజిక పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ పధకాలు అయితే అమలు చేసింది. కానీ కీలకమైనవి ఇంకా మిగిలే ఉన్నాయి.
వీటి మీదనే విపక్షాలు కూడా రచ్చ చేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ అయితే సూపర్ సిక్స్ సెవెన్ అంటూ ఎన్నికల్లో చెప్పారు కానీ ఏ ఒక్కటీ అమలు కావడం లేదు అని విమర్శలు చేస్తున్నారు. ఇక కీలకమైన పధకాలలో తల్లికి వందనం అన్నది ఒకటి ఉంది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ ఈ పధకం వర్తింప చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. ఆ పధకం అమలు చేయడానికి వేల కోట్లు అవసరం అవుతాయి.
అలాగే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒకటి ఉంది. ఈ రెండు హామీలతో పాటు రైతులకు అన్నదాత సుఖీభవ, 18 ఏళ్ళు నిండిన మహిళలకు నేలకు వారి ఖాతాలలో 15 వందల రూపాయలు వేయడం, నిరుద్యోగులకు మూడు వేల భృతి వంటివి ఉన్నాయి.
అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్న వేళ తల్లికి వందనం మీద ఒత్తిడి పెరుగుతోంది. అలాగే ఉచిత బస్సు పధకం మీద ఆశ పెట్టుకున్న వారు ఉన్నారు. దీంతో ఈ పధకాల గురించి ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.
నిజానికి చూస్తే ఈ రెండు పధకాల గురించి గడచిన మంత్రి వర్గ సమావేశాలలో చర్చిస్తారు అని ప్రచారం సాగింది. కానీ చివరికి వీటి గురించి చర్చించకుండానే ముగిసేవి. ఇపుడు కూడా మంత్రి వర్గ సమావేశం అనగానే వీటి గురించే మాట్లాడుకుంటున్నారు.
మరి ఈసారి అయినా ఈ పథకాల గురించి చర్చించి ఎపుడు అమలు చేస్తున్నది నిర్ణయిస్తారా అన్నది అయితే అంతా ఆలోచిస్తున్నారు అయితే ఈ పధకాలు అమలు చేయడం అంత సులువు కాదని అంటున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే కొత్త బస్సులు కొనాలి, వాటికి కొత్తగా సిబ్బందిని తీసుకోవాలి. అంతే కాదు దీని వల్ల ఆటో డ్రైవర్లకు వారి ఉపాధికి ఇబ్బంది వస్తే ఎలా అన్నది చూసుకోవాలి.
తల్లికి వందనం అన్నది బడ్జెట్ లో అతి పెద్ద మొత్తాన్నే తీసుకుంటుంది. అయితే ఈ పధకాలు అన్నీ కూడా మహిళలను ఉద్దేశించి డిజైన్ చేసినవి కావడంతో వారు నిరాశ పడుతున్నారు అన్న నివేదికలు వస్తున్నాయి. దాంతో వీటి విషయమో ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతే కాదు వీటి విధి విధానాలను కూడా మరోసారి ఖరారు చేయాల్సి ఉందని అంటున్నారు.