సీనియర్లకు.. సిట్టింగులకు మొండిచేయి.. బాబు వ్యూహం ఇదేనా?

పదవులు మాత్రమే తప్పించి.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించే విషయంలో యనమల రామక్రిష్షుడు తీరు తెలిసిందే.;

Update: 2025-03-10 04:11 GMT

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరు ఆసక్తికరంగానే కాదు.. పార్టీలో హాట్ చర్చకు తెర తీసినట్లుగా చెబుతున్నారు. మారిన చంద్రబాబుకు నిదర్శనంగా అభ్యర్థుల ఎంపిక ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పార్టీలో సీనియర్ నేతలకు కాదనలేక.. కష్టకాలంలో ముఖం చాటేసే సీనియర్లకు చెక్ పెట్టటంతో పాటు.. సిట్టింగులకు కూడా ఒకేసారి షాకిచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.

పదవులు మాత్రమే తప్పించి.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించే విషయంలో యనమల రామక్రిష్షుడు తీరు తెలిసిందే. అయినప్పటికీ ఆయనకు వరుస పెట్టి పదవులు ఇచ్చిన చంద్రబాబు.. ఈసారి ఆయనకు అవకాశం కల్పించకపోవటం.. మరో సిట్టింగ్ అశోక్ బాబుకు సైతం మొండిచేయి చూపారు. పదవులన్ని ఎప్పుడు కొందరికే దక్కుతాయి తప్పించి.. పార్టీ కోసం పని చేసే మిగిలిన వారి సంగతేంటి? అన్న ప్రశ్నకు సమాధానంగా తాజా ఎంపిక ఉందని చెబుతున్నారు.

మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుకు రెండోసారి అవకాశం దక్కదన్న విషయం మొదట్నించి వినిపిస్తున్నదే. అయితే.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తికి టికెట్ ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమైనా.. అందుకు భిన్నంగా నిర్ణయం ఉండటం ఆసక్తికరంగా మారింది. పార్టీలో సీనియర్లుగా ఉన్న దేవినేని ఉమకు ఈసారి అవకాశం దక్కలేదు. పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మకు చోటు దక్కలేదు. ఎంపిక చేసిన అభ్యర్థులకు స్వయంగా ఫోన్ చేసి చెప్పిన చంద్రబాబు.. టికెట్ ఆశించి ఇవ్వని వారికి మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించటం

Tags:    

Similar News