పాడె మోసిన చంద్రబాబు.. డప్పు కొట్టిన మంద కృష్ణ!
ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రామ్ముర్తి నాయుడి తనయుడు, సినీ నటుడు నారా రోహిత్, ఆయన అన్న నారా గిరీష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఈ రోజు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగాయి. ఈ సందర్భంగా అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఈ సమయంలో తన సోదరుడి పాడెను సీఎం చంద్రబాబు మోశారు!
ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రామ్ముర్తి నాయుడి తనయుడు, సినీ నటుడు నారా రోహిత్, ఆయన అన్న నారా గిరీష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తల్లితండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సమయంలో తమ్ముడి పాడేను సీఎం చంద్రబాబు మోయగా.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డప్పు కొట్టారు. ఈ సందర్భంగా... 1997లో నారావారిపల్లి నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు నారా రామ్మూర్తినాయుడు ఇంట్లోకి పిలిచి ఆప్యాయంగా చూసుకున్నారని.. వాళ్ల తల్లితండ్రుల ఆశీస్సులు ఇప్పించి పంపారని గుర్తుచేసుకున్నారు. ఆయనకు డప్పుకొట్టి నివాళి అర్పించినట్లు తెలిపారు.
కాగా... సుమారు వారం రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్మూర్తినాయుడు కార్డియక్ అరెస్ట్ తో శనివారం ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సినీనటుడు మోహన్ బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రామ్మూర్తినాయుడికి నివాళులర్పించారు.