పంతాల‌కు ఫుల్ స్టాప్‌.. చంద్ర‌బాబు సైలెంట్ గేమ్‌...!

అయితే.. ఇది మొన్న‌టి మాట‌. ఈ పంతాల‌కు ఇప్పుడు చంద్ర‌బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Update: 2024-09-08 04:37 GMT

పంతాలు.. ప‌ట్టింపుల‌కు రాజ‌కీయాలు పెట్టింది పేరు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పంతాలు, ప‌ట్టింపులు ఎక్కువ‌. తెలంగాణ చూస్తే.. కేసీఆర్ తీసుకువ‌చ్చిన ప‌థ‌కాల‌ను చాలా వాటిని రేవంత్‌రెడ్డి స‌ర్కారు ప‌క్క‌న పెట్టింది. బ‌తుక‌మ్మ చీర‌లు, ధ‌ర‌ణి(ఇది కొంత వివాదం అయింది) వంటివా టిని పూర్తిగా వెన‌క్కి నెట్టింది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో జ‌గ‌న్ ఏకంగా.. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్టి.. మూడు రాజ‌ధానులు తీసుకువ‌చ్చారు.

పేద‌ల‌కు రూ.5కే అన్నం పెట్టిన అన్న క్యాంట‌న్ల‌ను కూడా జ‌గ‌న్ పంతానికిపోయి ర‌ద్దు చేశారు. ఇలా అనే కం ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు చూస్తే.. చంద్ర‌బాబు స‌ర్కారు కూడా.. తొలినాళ్ల‌లో అంటే.. గ‌త మూడు మాసా ల్లో పంతానికి పోయింది. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను.. ప‌క్క‌న పెట్టింది. ఇంటింటికీ రేష‌న్ అందించే వాహ‌నాల‌ను కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసేసే ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సంబంధించిన ఆర్డ‌ర్లు కూడా వ‌చ్చాయి . తీసేయ‌డం ఖాయం.

అయితే.. ఇది మొన్న‌టి మాట‌. ఈ పంతాల‌కు ఇప్పుడు చంద్ర‌బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందు లను వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పంతాల‌కు పోకుం డా.. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన వ్య‌వ‌స్థ‌ల‌నే చంద్ర‌బాబు ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. వ‌లంటీర్ల‌ను రంగంలోకి దింపారు.

రేష‌న్ వాహ‌నాలు దాదాపు 1100 లైన్‌లో పెట్టారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వాహ‌నాల సేవ‌లు వాడుకుం టున్నారు. ఎన్యూమ‌రేష‌న్‌(బాధితుల వివ‌రాలు తెలుసుకునే ప్ర‌క్రియ) కోసం వ‌లంటీర్ల‌ను తీసుకువ‌చ్చా రు. వీరైతే కేవ‌లం గంట వ్య‌వ‌ధిలో ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారు. ఎవ‌రికి ఇబ్బందులు వ‌చ్చాయ‌న్న లెక్క‌లు ప‌క్కాగా చెప్పేస్తారు. దీంతో సాయం చేయ‌డం తేలిక అవుతుంది. అందుకే.. చంద్ర‌బాబు రాజ‌కీయ పంతాల‌కు పోకుండా వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు.

Tags:    

Similar News