జిల్లాల‌పై జిగిబిగి... బాబు నెత్తిన భారం... !

కొత్త జిల్లాల‌ను ఏం చేయాలి? ర‌ద్దు చేయ‌డ‌మా..? కొన‌సాగించ‌డమా? ఇదీ.. ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు ముందున్న కీల‌క విష‌యం.

Update: 2024-12-03 09:30 GMT

కొత్త జిల్లాల‌ను ఏం చేయాలి? ర‌ద్దు చేయ‌డ‌మా..? కొన‌సాగించ‌డమా? ఇదీ.. ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు ముందున్న కీల‌క విష‌యం. కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది వైసీపీ ప్ర‌భుత్వం కాబ‌ట్టి.. వాటిని ర‌ద్దు చేసి పాత జిల్లాలు గానే కొన‌సాగించాల‌న్న‌ది కూట‌మి నేత‌ల డిమాండ్. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యా ణ్‌.. కొత్త జిల్లాల‌పై ఆస‌క్తి చూపించ‌డం లేదు. పైగా.. ఆయ‌న ఎక్క‌డ మాట్టాడినా.. కూడా ఉమ్మ‌డి జిల్లాలు అంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోవైపు కూట‌మి నాయ‌కులు కూడా కొత్త‌వి వ‌ద్ద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు జిల్లాల‌పై ఏం చేయాల‌న్న విష‌యంపై పెద్ద ఎత్తునే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతు న్నారు. ఇప్ప‌టి కిప్పుడు కొత్త‌వాటిని ర‌ద్దు చేస్తే.. మ‌ళ్లీ పెద్ద క్ర‌తువును నెత్తిన వేసుకున్న‌ట్టే అవుతుంది. అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకుని. కేంద్రానికి పంపించి.. రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెచ్చుకుని త‌ర్వాత ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి. కొత్తవి ఎందుకు ర‌ద్దు చేస్తున్నామ‌నే విష‌యాన్ని వివ‌రించాలి. దీనిలో కొంత రాజ‌కీ యం కూడా మిళిత‌మై ఉంది కాబ‌ట్టి ఇది మ‌రింత క‌ష్టం.

పోనీ.. కొత్త‌వాటినే కంటిన్యూ చేయాలంటే.. వీటిని వైసీపీ హ‌యాంలో ఏర్పాటు చేశారు కాబ‌ట్టి.. త‌మ‌కంటూ .. ఒక ముద్ర ఉండాల‌నేది టీడీపీ స‌హా కూట‌మి నేత‌లు కోరుతున్నారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా కొత్త జిల్లాల్లో మౌలిక స‌దుపాయాలను ఏర్పాటు చేయాలి. ప్ర‌భుత్వ భ‌వ‌నాలు.. ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలు క‌ల్పించాలి. ఇదే స‌మ‌యంలో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయడంతోనే ఐపీఎస్‌, ఐఏఎస్ వంటి అఖిల భార‌త స‌ర్వీసు అధికారులు రాష్ట్రంలో పెరిగారు.

వీరివ‌ల్ల ప్ర‌భుత్వ పాల‌న స‌జావుగా సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ఇప్పుడు జిల్లాల‌ను తీసేస్తే.. కేం ద్రం స‌ద‌రు అధికారుల‌ను వెన‌క్కి తీసుకునే అవ‌కాశంతో పాటు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా.. 30 నుంచి 50 మంది అధికారుల‌ను వేర్వేరు విభాగాల‌కు స‌ర్దు బాటు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఇబ్బందే. మొత్తంగా చూస్తే..కొత్త‌వి కొన‌సాగించాల‌న్నా.. ర‌ద్దు చేయాల‌న్నా..చంద్ర‌బాబుకు పెద్ద విష‌మ ప‌రీక్ష‌గానే మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మంగ‌ళ‌వారం నిర్వ‌హించ‌నున్న కేబినెట్ భేటీలో ఆయా అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోచూడాలి.

Tags:    

Similar News