11 మంది.. 11 గంటలు.. 11 నిమిషాలు : సీఎం చంద్రబాబు సెటైర్లు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రసంగించారు

Update: 2025-02-25 13:40 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వైసీపీని మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రసంగించారు. నిన్న సమావేశాలు ప్రారంభం సందర్భంగా సభకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా తమకు ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వలేదంటూ ఆందోళన చేసి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

‘‘41 ఏళ్ల రాజకీయ అనుభవంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీని వస్తామనే పార్టీని నిన్నే చూశా.. ఒక విధంగా చెప్పాలంటే నిన్న ఒక చీకటి రోజు. ప్రజలు 11 మందిని గెలిపించారు.. 11 గంటలకు వచ్చారు.. 11 గంటల 11 నిమిషాలకు వెళ్లిపోయారు. అంటే కరెక్టుగా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ ను అవమానించారు’’ అంటూ చంద్రబాబు వైసీపీని ఏకిపారేశారు.

సహజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో ఈ మాదరి చమత్కారం, వెటకారం కనిపించడం చాలా తక్కువ. కానీ, ఈ సారి మంచి జోష్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీపై సెటైర్లు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని ఎవరు టార్గెట్ చేసిన 11 ప్రధానంగా ఉంటోంది. 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ విపక్ష హోదా కోసం పట్టుబడటంపై కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా 11 అంటూ వైసీపీని వెటకారమాడటం నెటిజన్లను ఆకర్షించింది.

Tags:    

Similar News