బీజేపీ ప్రభుత్వం వరద సాయం ఇచ్చిందా చంద్రబాబూ...ప్రజలకు చెప్పండి !

ఏపీలో బీభత్సమైన వానలు వరదలు వచ్చాయి. చంద్రబాబు చెబుతున్నట్లుగానే చరిత్ర ఎరగని విపత్తు ఇది.

Update: 2024-09-18 07:31 GMT

ఏపీలో బీభత్సమైన వానలు వరదలు వచ్చాయి. చంద్రబాబు చెబుతున్నట్లుగానే చరిత్ర ఎరగని విపత్తు ఇది. పదుల సంఖ్యలో చనిపోయారు. అలాగే ఉన్న వారు ఏమీ లేకుండా నిరాశ్రయులు అయ్యారు ఇంత పెను విపత్తు ఏపీని తాకి చిగురాకులా ఏపీ వణికినా కూడా కేంద్రం నుంచి అధికారికంగా ఇంత స్థానం వచ్చింది అన్న ప్రకటన అయితే లేదు.

నిజానికి ఇలాంటి విపత్తులు వచ్చినపుడు కేంద్ర బృందాలు వచ్చి అంతా అంచనా కట్టీ ఇచ్చే నివేదిక వరకూ చూడకుండా తక్షణ ఆర్థిక సాయం ప్రకటిస్తూ ఉంటారు. అలా ఏపీకి ఆర్థిక సాయం కేంద్రం ఇచ్చినట్లుగా అధికారికంగా అయితే లేదు. మరో వైపు చూస్తే జాతీయ విపత్తుగా దీనిని పరిగణించాలని చంద్రబాబు కోరారు. కానీ కేంద్రం ఆ దిశగా ఆలోచన చేసినట్లు లేదు.

మరో వైపు కేంద్ర వ్యవసాయ మంత్రి సీనియర్ మోస్ట్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలో పర్యటించి తాను వేసినా అంచనా నివేదికను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇచ్చారు. మరో వైపు కేంద్ర బృందం కూడా అంచనా వేసింది. అది కూడా తొందరలోనే కేంద్రానికి చేరుతుంది. ఇక చూస్తే వరదలు వచ్చి జనాలు నరకం ఈ రోజుకీ చూస్తున్నారు. ఇరవై రోజులు ఇట్టే గడచిపోయాయి. కానీ వారికి పైసా సాయం కూడా అందలేదు.

ఇక ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా వరద సాయం ప్రకటించింది.మరి కేంద్ర సాయం ఎంత ఇచ్చారు, అసలు ఇచ్చారా లేక ఇస్తారా అన్న దాని మీద చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే కేంద్ర సాయం మీద చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడంతోనే అంతా డిస్కషన్ చేస్తున్నారు.

బాబు ఏమన్నారు అంటే రాష్ట్రానికి కేంద్ర సాయం గురించి ఇపుడే చెప్పలేమని. అంతే కాదు ముందుగా అంచనా వేయడం కూడా సరికాదు అని. వచ్చాకనే ఏ సంగతీ వెల్లడిస్తామని కూడా బాబు అన్నారు. బాబు అన్న మాటలను బట్టి చూస్తే కేంద్ర సాయం వస్తే చెబుతామని అంటున్నారు. అంటే ఈ రోజుకీ రాలేదని అర్థం చేసుకోవాలి. మరి ఇంతటి ప్రకృతి విలయం సంభవించాక కూడా కేంద్ర సాయం తొందరగా రావాలి కదా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు చూస్తే ఎంత వస్తుంది అన్న అంచనా వేయలేమని బాబు అంటున్నారు. అంటే వేల కోట్లు నష్టం జరిగింది అని ఏపీ ప్రభుత్వం తేల్చింది. అది కూడా ప్రాథమిక అంచనాగా పేర్కొంది. అంటే ఏడు వేల కోట్ల రూపాయల దాకా నష్టం వచ్చింది అని అంటున్నారు. మరి అంత మొత్తం కేంద్రం ఇవ్వాలని బాబు ఆశిస్తున్నారా అన్నది చూడాలి. మరి అంత ఆశించినా కేంద్రం ఇవ్వదని కూడా టీడీపీ కూటమి పెద్దలు భావిస్తున్నారా అన్నది మరో చర్చ.

ఏపీలో టీడీపీ కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలలో బీజేపీ ఉంది. మరి బీజేపీ ఇప్పటికి అయినా పెద్ద ఎత్తున సాయం చేయాల్సి ఉంది అని అంటున్నారు. అలా కాకుండా నానుస్తూ పోతే వరద నష్టం కష్టం ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. మరో వైపు ఏపీ ప్రభుత్వం వరద సాయం చేస్తుంది. దానికి సొమ్ము అన్నది ఏపీ ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచే పెట్టుకుంటోందా అన్న ప్రశ్నలు ఉన్నాయి.

ఆ మధ్యన ఏపీ తెలంగాణాలకు కలిపి మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం ప్రకటించింది అన్నది వైరల్ అయింది. అయితే అలాంటిది ఏమీ లేదని బాబు తేల్చేశారు. ఏది చూసినా కూడా కేంద్ర సాయం మీద భిన్నమైన స్పందనలే కనిపిస్తున్నాయి.

కేంద్రం సాయం చేస్తుందా చేస్తే ఎంత అన్నది ఎవరి లెక్కలు అంచనాలూ వారికి ఉన్నాయి. అందుకే బాబు ముందే ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దని చెప్పేసారు. అంటే బాబుకు ఎంత వస్తుందో మనసులో ఒక అంచనా ఉందా అన్నది కూడా చర్చిస్తున్నారు. ఏది ఏమైనా వరద సాయం అన్నది ఆలస్యం లేకుండా కేంద్రం చేయాలి. ఆ విధంగా రాష్ట్రం ఒత్తిడి పెట్టాల్సి ఉంది. మరి కూటమి ప్రభుత్వం అక్కడా ఇక్కడా ఉన్నా కూడా ఏపీ వరద బాధితులకు ఎంత ఒరిగేది ఎంత దక్కేది అన్నది తొందరలోనే తేలుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News