సొంత జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాట వినడం లేదా?
ఇసుక, మద్యం విషయాల్లో ఏమాత్రం ఇంటర్పీరెన్స్ ఉండకూడదని సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యేలు తోక జాడిస్తే చంద్రబాబు చూస్తూ ఊరుకోరని.. రాజకీయాల్లో సీరియస్ నెస్ ఉండకపొతే ఆయన ఉపేక్షించరని.. తన మాటలు బేఖాతరు చేస్తే సీరియస్ చర్యలకు ఉపక్రమిస్తారని.. కొంతమంది వల్ల మొత్తం పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంటే ఏ మాత్రం సహించరని అంటుంటారు. ఈ సమయంలో చంద్రబాబుకు మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చాయనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. ఆయన ఎన్ని సార్లు, ఎంత గట్టిగా, మరెంత సూటిగా చెప్పినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని.. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్నట్లుగా వారి వ్యవహారం ఉందని అంటున్నారు. ఇందుకు కారణమైంది... మద్యం వాపారులపై ఎమ్మెల్యేల ఒత్తిడి అవిరామంగా కొనసాగుతుండటమే!
వివరాళ్లోకి వెళ్తే... లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని.. మద్యం వ్యాపారులపై ఒత్తిళ్లు తీసుకురావొద్దని.. ఇసుక, మద్యం విషయాల్లో ఏమాత్రం ఇంటర్పీరెన్స్ ఉండకూడదని సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ విషయంలో ఎమ్మెల్యేల వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అయినప్పటికీ తమ్ముళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది!
వాస్తవానికి గత నెల 14, 15 తేదీల్లో ఏపీలో ఎక్సైజ్ శాఖ 3,396 మద్యం షాపులకు ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేసింది. దీంతో... 16 నుంచి షాపులు మొదలైపోయాయి. సాధారణంగా ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేసిన తర్వాత పది రోజుల్లోనే రెగ్యులర్ లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే.. ఎపీలో ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా లేదని అంటున్నారు.
కొత్త లిక్కర్ షాపులు ఓపెన్ అయ్యి సుమారు నెల రోజులు అవుతున్నా.. ఇప్పటికీ 489 షాపులకు రెగ్యులర్ లైసెన్సులు దక్కలేదంట. దీనికి కారణం.. స్థానిక ఎమ్మెల్యెలు అడ్డంకులు సృష్టించడమే అన్ని అంటున్నారు. ఫలితంగా... కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పదుల సంఖ్యలో దుకాణాలకు రెగ్యులర్ లైసెన్స్లు లేవని అంటున్నారు.
ఇదే సమయంలో తమకు వాటాలు ఇవ్వని వారికి, తమ మాట వినని వారికి, తాము చెప్పినట్లు నడుచుకోని వారికి సరైన షాపులు దొరక కుండా చేస్తున్నారని అంటున్నరు. ఈ మేరకు బిల్డింగ్ యజమానులకు ఫోన్స్ చేసి ఎమ్మెల్యే మనుషులు బెదిరిస్తున్నారని చెబుతున్నారు. దీంతో... లిక్కర్ షాపుల యజమానులు.. లబో దిబో మంటున్నారని అంటున్నారు.