జగన్ ఆలోచనను తెలివిగా వాడుకున్న చంద్రబాబు

ఆలోచన జగన్ దే కానీ దానిని సక్సెస్ ఫుల్ గా అమలు చేసి చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Update: 2024-09-06 16:00 GMT

ఆలోచన జగన్ దే కానీ దానిని సక్సెస్ ఫుల్ గా అమలు చేసి చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక విధంగా మంచి ఎక్కడ ఉన్నా వాడుకోవడం తప్పు లేదు అని కూడా చెప్పారు. అంతే కాదు వైసీపీ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే ఆయన ఆ ఆలోచనను అమలు చేశారు. అది కూడా సంక్లిష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు ఈ పని చేశారు.

దీనిని వైసీపీ వారు అయితే మా అధినేత ఆలోచనను కూటమి పెద్దలు కాపీ చేశారు అని అంటున్నారు. అయితే టీడీపీ కూటమి నేతలు మాత్రం వృధాగా పడి ఉన్న వాహనాలను బయటకు తీశామని అంటున్నారు. ఇంతకీ ఈ కధా కమామీషూ ఏంటో చూస్తే ఆసక్తికరమే.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు సీఎం గా జగన్ రేషన్ సరుకులను ఇళ్ళకు పంపించేందుకు భారీ ఎత్తున వాహనాలు కొనుగోలు చేశారు. ఇది పట్టణాల స్థాయిలో సక్సెస్ అయింది. అయితే రూరల్ లో కూడా అదే విధంగా చేయాలని ఏకంగా 539 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరీ పెద్ద ఎత్తున వాహనాలను కొనుగోలు చేశారు.

దానిని పైలెట్ ప్రాజెక్ట్ గా టేకప్ చేసినా ఎందుకో అది అనుకున్నంతగా ఫలితాలు ఇవ్వలేదని అంటున్నారు.దాంతో చాలా వాహనాలు కొత్తగా కొనుగోలు చేసినా మూలన ఉన్నాయి. అవన్నీ కొద్ది నెలలుగా ఏ మాత్రం ఉపయోగం లో లేకుండా ఉన్నాయి.

అయితే ఇపుడు ఆ వాహనాలకు మోక్షం వచ్చింది. కూటమి ప్రభుత్వం వాటిని బెజవాడ వరద ప్రాంతాలలో సహాయ చర్యలకు తరలించింది. అలా వాటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంది. వరసగా బారులు తీరి ఉన్న ఈ వాహనాలలో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను అందించడం అన్నది కూటమి ఆలోచన. ఇది బాగా సక్సెస్ అయింది.

వరద బాధితులకు ఎలా సహాయం చేయాలి అన్న ఆలోచన వచ్చినపుడు ఇలా పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన వాహనాలు పడి ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకుని రావడం ఒక ఎత్తు అయితే సరైన సమయంలో వాటిని ఉపయోగించుకోవడం మరో ఎత్తు.

ఈ విధంగా కూటమి సర్కార్ సక్సెస్ ఫుల్ గానే అమలు చేసింది అని అంటున్నారు. దాంతో ఈ వాహనాలలోనే వరద బాధితులకు ఇపుడు పెద్ద ఎత్తున రైస్ తో పాటు వారికి అవసరం అయిన తాగు నీరు ఇతర నిత్యావసరాలు అన్నీ కూడా చాలా స్పీడ్ గా అందేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మెచ్చతగినవిగానే ఉన్నాయని అంటున్నారు.

నిజంగా చూస్తే వైసీపీ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ వాహనాలను కొనుగోలు చేసినా ఇపుడు ఇంతటి కష్టమైన వేళ ఎమర్జెన్సీ గా వీటిని వాడుకోవడం మంచిదే. అలాగే ఈ వాహనాల కొనుగోలుకు కూడా ఈ విధంగా సార్ధకత ఏర్పడింది అని అంటున్నారు.

మరో వైపు ఈ వాహనాలతో పాటు ప్రభుత్వం లారీలు అలాగే ట్రక్కులతో పాటు ఇతర వాహనాలను కూడా ఎంగేజ్ చేస్తోంది. దీంతో చాలా పెద్ద ఎత్తున వరద సాయం బాధితులకు అందుతోంది. ప్రభుత్వం మళ్లీ మామూలు పరిస్థితికి వరద ప్రాంతాలను తీసుకుని రావడానికి చేస్తున్న కృషి కూడా ఇందులో కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒక ప్రభుత్వం చేసిన ఆలోచనను మరో ప్రభుత్వం ఈ విధంగా వాడుకోవడం అది కూడా అత్యవసర సేవలకు వినియోగించడం అంటే మంచి పరిణామంగా చూడాలని అంటున్నారు. ఎవరి ఆలోచన ఎవరిది అమలు అన్నది పక్కన పెడితే ఇదంతా ప్రజల సొమ్ము, వారికి కష్టంలో ఆదుకోవడం కూడా కరెక్ట్ అని అంటున్నారు.

Tags:    

Similar News