పుష్ప లకు చంద్రబాబు మాస్ వార్నింగ్!
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇటీవల ఎక్కువైందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్న వేళ.. చంద్రబాబు సీరియస్ గా స్పందిస్తున్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై కొరఢా ఝులిపిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువవుతోందని.. ఆ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని చెప్పిన చంద్రబాబు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు!
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇటీవల ఎక్కువైందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్న వేళ.. చంద్రబాబు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఇదే సమయంలో... సహజ వనరులను దోపిడీ చేయడానికి ప్రయత్నించేవారు తీవ్ర పరిణామాలను ఎదుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా.. సుమారు మూడున్నర కోట్ల రూపాయల విలువైన 155 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ను సీఎం చంద్రబాబు అభినందించారు.
అవును... తిరుపతి నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిల్వ ఉంచిన సుమారు రూ.3 కోట్ల విలువైన 155 ఎర్రచందనం దుంగలను గుజరాత్ లో స్వాధీనం చేసుకున్నారు. దీనికోసం ప్రత్యేక బృందం తిరుపతి నుంచి గుజరాత్ కు వెళ్లింది.
అక్కడ ఎర్ర చందనం గోడౌన్ లపై అకస్మికంగా దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు అంతరాష్ట్ర స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ సుబ్బారాయుడు... అన్నమయ్య జిల్లాలో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాళ్ల ద్వారా తిరుపతి నుంచి అక్రమంగా రవాణా చేయబడిన ఎర్ర చందనం గుజరాత్ గోడౌన్ లో ఉందని తెలుసుకున్నట్లు తెలిపారు. దీంతో... తమ ప్రత్యక బృంధాన్ని అక్కడకు పంపించినట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో గుజరాత్ కు వెళ్లిన ఏపీ పోలీసులు, అక్కడి పోలీసుల సాయంతో అక్కడున్న ఎర్ర చందనం దుంగలను అదుపులోకి తీసుకున్నారని.. భవిష్యత్తులో స్మగ్లింగ్ ను అరికట్టడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా ఆగస్టులో మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు... ఎర్ర చందనం స్మగ్లర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్మగ్లర్లు అడవిలో అడుగుపెడితే.. అదే చివరి రోజని.. వారిని డ్రోన్ల సహాయంతో వెంటాడి పట్టుకుంటామని చంద్రబాబు చెప్పారు.