ఆ ఒక్క మంత్రి పదవి బాబు ఉంచింది ఎవరికో తెలిసింది?

ఈ సమయంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. ఆయన కోసమే చంద్రబాబు ఆ మంత్రి పదవిని అట్టిపెట్టి ఉంచినట్లు చెబుతున్నారు.

Update: 2024-06-18 16:30 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ చంద్రబాబు మంత్రివర్గంలో ప్రస్తుతం 24 మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మరో మంత్రి పదవిని చంద్రబాబు ఎవరి కోసం పెట్టి ఉంచారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే.. అనూహ్యంగా తాజాగా ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది.

అవును... చంద్రబాబు కేబినెట్ లో 24 మంది మంత్రులే ఉన్న సమయంలో... ఆ మిగిలిన పోస్ట్ ఎవరి కోసం అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. ఆయన కోసమే చంద్రబాబు ఆ మంత్రి పదవిని అట్టిపెట్టి ఉంచినట్లు చెబుతున్నారు. ఇందుకు గలకారణాలు ఆసక్తిగా మారాయి.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో కమ్మ - కాపు ఈక్వేషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి రావడంలో ఈ రెండు సామాజికవర్గాలూ కీలక భూమిక పోషించాయని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా వంగవీటి రాధా విశేషంగా కృషి చేశారని.. కోస్తా జిల్లాల్లో కూటమి ఘనవిజయంలో రాధా పాత్ర కీలకంగా పని చేసిందని టీడీపీ అధినేత భావిస్తున్నారంట.

ఈ ఎన్నికల్లో కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో బలంగా పాల్గొనడమే కాకుండా.. వ్యూహాత్మకంగా పావులు కదిపారని.. కాపు ఓట్లు చీలకుండా, అవన్నీ కూటమి వైపు టర్న్ అయ్యేలా చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా వంగవీటి రాధా కృషిని గ్రుతించి ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా కేబినెట్ బెర్త్ దక్కొచ్చని ప్రచారం జరుగుతుంది.

చంద్రబాబు మంత్రివర్గంలో ఖాళీ ఉన్న ఓ మంత్రి పదవిని వంగవీటి రాధకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి కాపు సామాజికవర్గానికి చెందిన నలుగురికి మంత్రి పదవుల్లు దక్కినప్పటికీ చంద్రబాబు మాత్రం రాధాను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారని.. త్వరలో మండలికి రాధాను ఎంపిక చేసి కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ బలంగా నడుస్తుంది.

ఈ రకంగా అటు కాపులకు టీడీపీలో సముచిత స్థానం దక్కుతుందనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలోకి వెళ్లడంతోపాటు.. టీడీపీకి ఆ సామాజికవర్గం బలమైన బ్యాక్ బోన్ గా మారే పరిస్థితులు మరింత బలంగా ఉంటాయని చెబుతున్నారు. ఏది ఏమైనా... వంగవీటి రాధాను చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకుంటే అదొక చరిత్ర అవుతుందని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News