జగన్ దారిలోనే నడుస్తోన్న చంద్రబాబు...?
కానీ, ఇప్పుడు జగన్ చెప్పుకొనేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా.. కూటమి ప్రభుత్వమే జగన్ పాలనకు సంబంధించిన ఆత్మను ప్రచారంలో ఉంచింది.
జగన్ ప్రభుత్వం పోయింది. కూటమి సర్కారు వచ్చింది. ప్రజలు మార్పు కోరుకున్నారు.. ప్రభుత్వాన్ని మార్చేశారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. 2019కి 2024కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పోయి.. వైసీపీ వచ్చిన తర్వాత.. తనకంటూ ప్రత్యేక మైన అంశాలతో జగన్ ముందుకు సాగారు. అప్పటి వరకు ఉన్న అన్న క్యాంటీన్లను ఎన్ని విమర్శలు వచ్చినా పక్కన పెట్టారు. ''మమ్మల్ని ఎన్నుకున్నది టీడీపీ పథకాలు కొనసాగించేందుకు కాదు. అలా అయితే.. ప్రజలు వారినే కొనసాగించి ఉండేవారు కదా!'' అని అప్పటిమంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటుంది.
ఇలా.. గత ప్రభుత్వం తాలూకు పథకాలు.. కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసి.. తనదైన మార్కు వేశారు. అంతేకాదు.. కీలకమై న పథకాలను కూడా వెంట వెంటనే అమలు చేశారు. పథకాల అమలుకు సంబంధించి కూడా.. ప్రత్యేక కేలండర్‌ను తీసుకువ చ్చారు. నాడు-నేడు అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దీనిని తాజాగా మండలిలో మంత్రి నారా లోకేష్ కూడా అంగీకరించారు. ఇక, నవరత్నాలు-జగనన్న ఇళ్లు అనే కార్యక్రమం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. అది సెంటే కావొచ్చు.. సెంటున్నరే కావొచ్చు. మొత్తానికి ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. గత సర్కారు వాసనలు లేకుండా చేశారు.
కట్ చేస్తే..ఇప్పుడు కూటమి సర్కారు చేసిన ప్రయత్నం, చెప్పిన పథకాలను గమనిస్తే.. జగన్‌ను అనుసరిస్తున్నట్టుగానే ఉంది తప్ప.. తమ ఫ్లేవర్ అయితే కనిపించడం లేదు. అమ్మ ఒడి- తల్లికి వందనంగా మారింది. అదేవిధంగా ఇతర పథకాలకు కూడా పేర్లు మార్చే ప్రయత్నం చేశారే.. తప్ప.. వాటి ఆత్మను మార్చే ప్రయత్నం చేయలేక పోయారు. ఇది.. కూటమి సర్కారు కంటే కూడా.. జగన్‌కే మేలు చేసేలా ఉందన్న చర్చ సాగుతోంది. సాధారణంగా.. ఒక మార్పు వచ్చినప్పుడు.. అది సమూలంగా ఉండాలి. ఇక, మరిచిపోయేలా ఉండాలి. ఉదాహరణకు షాదీ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్‌కానుకలను ప్రజలు మరిచిపోయా రు.
అందుకే చంద్రబాబు వాటిని ఎప్పటికప్పుడు లైవ్‌లో ఉంచే ప్రయత్నం చేశారు. తమ సర్కారు పాలనను పదే పదే చెప్పడం ద్వారా.. అనేక రూపాల్లో జగన్ పాలనలో ప్రజలు మరిచిపోయిన చంద్రబాబు పాలనను ఆయన గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పుడు జగన్ చెప్పుకొనేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా.. కూటమి ప్రభుత్వమే జగన్ పాలనకు సంబంధించిన ఆత్మను ప్రచారంలో ఉంచింది. కేవలం పేర్లు మార్చడం ద్వారా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ''ఇవన్నీ జగన్ అమలు చేసినవే'' అనే మాటను తుడిచేయలేరు. ఇప్పుడు ఇదే చర్చ గ్రామీణ స్థాయిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. సో.. జగన్ బాటలో నడవడం కరెక్ట్ కాదని.. కొత్తగా ఆలోచనలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.