చంద్రబాబు ప్రమాణానికి ముందు ఈసారి తీరని లోటు..

గన్నవరంలోని కేసరిపల్లిలో బుధవారం చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు. వాస్తవానికి

Update: 2024-06-08 10:33 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు సారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన ఘటన ఆయనకు వ్యక్తిగతంగా భారీ లోగుగా మిగలనుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఓసారి ఇదీ తేదీ అంటూ ప్రమాణ స్వీకారంపై కథనాలు వచ్చినా.. మరో తేదీ ఫిక్సయింది. ఇప్పుడు అనుకోకుండా జరిగిన ఘటనతో ఏం జరుగుతుందో చూడాలి.

ముఖ్య అతిథిగా హాజరయ్యేవారేమో?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలి ఎన్నికల్లో జనసేన-బీజేపీతో కలిసి కూటమిగా వెళ్లి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెల 9నే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఇంతలో ప్రధాని మోదీ ఆ తేదీని బాధ్యతల స్వీకారానికి ఎంచుకోవడంతో చంద్రబాబు ప్రమాణం 12వ తేదీకి మారింది. గన్నవరంలోని కేసరిపల్లిలో బుధవారం చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు. వాస్తవానికి జీవించి ఉంటే.. దీనికి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించేవారేమో? అందులోనూ జీవిత చరమాంకంలో ఉన్న రామోజీ కూడా ప్రత్యేకంగా పాల్గొనేవారేమో? ఎందుకంటే.. ఆయన పుట్టిన జిల్లా క్రిష్ణాలో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతున్నందునే..?

వైసీపీ సర్కారుపై పోరాడి..

తొలినాళ్లలో మినహా వైసీపీ సర్కారు విధానాలపై ‘ఈనాడు’ మహా సమరం సాగించింది. దీంతోనే ఆ సంస్థ అధినేత రామోజీ రావును మార్గదర్శి కేసులో అరెస్టు చేసేందుకు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ ప్రయత్నించారు. ఇది నెరవేరలేదు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో రామోజీకి ఇబ్బందులు తప్పాయని అందరూ భావించారు. ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

చంద్రబాబుకు తీరని లోటే..?

రామోజీరావు మరణం వ్యక్తిగతంగా చంద్రబాబుకు తీరని లోటే అని చెప్పాలి. బాబును అన్నివిధాలా ప్రోత్సహించిన ఆయన.. మూడుసార్లు సీఎంగా ప్రమాణ స్వీకారాన్ని చూశారు. మరోసారి సరిగ్గా తాను ఎంతగానో వెన్నుతట్టిన చంద్రబాబు ప్రమాణం చేసే సమయానికి రామోజీ దివంగతులయ్యారు. విధి అంటే ఇదేనేమో?

Tags:    

Similar News