తిరువూరులో మళ్లీ మార్పు.. చంద్రబాబు మరో లెక్క!
దీంతో చంద్రబాబు ఒకరకంగా ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు ఎవరినీ కాదనుకునే పరిస్థితిలేదు.
టికెట్ల వ్యవహారం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. పొత్తుల కారణంగా కొన్ని స్థానాలను వదులు కోవా ల్సి వచ్చింది. ఇక, గత ఐదేళ్ల కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుల కారణంగా మరికొన్ని స్థానాలను కూడా సీనియర్లకు కేటాయించలేక పోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తులు పెరిగిపో యారు. దీంతో చంద్రబాబు ఒకరకంగా ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు ఎవరినీ కాదనుకునే పరిస్థితిలేదు. అలాగని అందరినీ భుజాన ఎక్కించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
అయినప్పటికీ.. తాజాగా మాజీ మంత్రి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన కేఎస్ జవహర్ కోసం.. చంద్రబాబు సాహసం చేస్తున్నారు. ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన ఓ స్థానాన్ని.. అక్కడ ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి జవహర్‌కు ఇచ్చేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అంతో ఇంతో మార్పు కనిపిస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తిరువూరు. తొలి జాబితాలోనే ఈ సీటుకు గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి చెందిన కొలిక పూడి శ్రీనివాసరావును కేటాయించారు.
అయితే.. ఎక్కడో పొరుగు జిల్లా నుంచి కొలికపూడిని తీసుకువచ్చి.. తమపై రుద్దుతున్నారంటూ.. తిరువూరు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు మండలాల్లోని ఆయనను తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. అయినప్పటికీ.. కొన్నాళ్లుగా సర్దుకు పోవాలని చంద్రబాబు చెబుతున్నారు. అయినా తమ్ముళ్లు సర్దుకు పోలేదు. ఇదిలావుంటే, మరోవైపు తనకు టికెట్ కేటాయించకుండా అన్యాయం చేశారంటూ.. జవహర్ గళం విప్పారు. అంతేకాదు.. కొవ్వూరు నియోజకవర్గంనుంచి తాను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తిరువూరు నుంచి ప్రకటించిన కొలికపూడిని వెనక్కి తీసుకుని, జవహర్‌ను అక్కడకు పంపించడం ద్వారా.. ఉభయ కుశలోపరిగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచా రం. అంటే.. తొలి జాబితాలోస్వల్ప మార్పు చేసి.. జవహర్‌ను సంతృప్తి పరచాలని చంద్రబాబు నిర్ణయిం చారు. ఇక, తిరువూరు విషయానికి వస్తే.. జవహర్‌కు సొంత నియోజకవర్గం. అయినప్పటికీ.. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడ ఓడిపోయారు. దీంతో తనకు కలిసి వచ్చిన కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్లారు. మరి ఇప్పుడు తిరువూరులో ఆయన ఆ మేరకు విజయం దక్కించుకుంటారో చూడాలి.