చంద్రబాబు పవన్ మల్టీ స్టారర్.... కలసి జనంలోకి...!

దాంతో రానున్న రోజులలో చంద్రబాబు సోలోగా ప్రచారం చేస్తూనే కొన్ని కీలక ప్రాంతాలలో పవన్ తో పాటు వేదికలను పంచుకోవాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

Update: 2023-11-23 09:39 GMT

ఏపీలో విపక్ష కూటమి గేర్ మార్చాలని చూస్తోంది. ఎన్నీల ఏడాదిలో అనవసరంగా విలువైన మూడు నెలల కాలం పోయింది అని టీడీపీ లో అంతర్మధనం జరుగుతోంది. చంద్రబాబు జైలు, బెయిల్ వంటి వాటితో 2023 చివరి నెలలు గడచిపోయాయని భావిస్తోంది. దాంతో రానున్న రోజులలో టీడీపీని పట్టాలెక్కించే పనిలో ఆ పార్టీ అధినాయకత్వం ఉంది.

టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తులలో ఉన్నాయి. దాంతో రానున్న రోజులలో చంద్రబాబు సోలోగా ప్రచారం చేస్తూనే కొన్ని కీలక ప్రాంతాలలో పవన్ తో పాటు వేదికలను పంచుకోవాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. వైసీపీకి బలం ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో కలసి జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల రెండు పార్టీల క్యాడర్ ఒక్కటి అవుతారని, అది పోలింగ్ బూత్ దాకా గ్రౌండ్ లెవెల్ లో పాలూ నీళ్ళ మాదిరిగా కలసి పనిచేయడానికి వీలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారుట. అలాగే అగ్ర నాయకత్వం ఒక్కటిగా ఉంటే పాజిటివ్ రియాక్షన్స్ కూడా క్యాడర్ లో వస్తాయని అంటున్నారు.

ఇక ఏపీలో వైసీపీ మీద పై చేయి సాధించడానికి ఒక్క సారిగా జనం మూడ్ మొత్తం తమ వైపునకు తిప్పుకోవడానికి ఈ మల్టీ స్టారర్ మీటింగ్స్ కలసి వస్తాయని కూడా పధక రచన చేస్తున్నారుట. ఇప్పటికే తెలంగాణలో మోడీ పవన్ మీటింగ్ ఒకటి నిర్వహించారు. అమిత్ షాతో కూడా పవన్ వేదిక పంచుకునే అవకాశాలు ఉన్నాయి.

అదే తీరున రేపటి రోజున ఏపీలో కూడా చంద్రబాబు పవన్ కలసి కనిపిస్తే ఆ వచ్చే వైబ్రేషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. ఇక పవన్ చంద్రబాబుని విజన్ ఉన్న నేతగా భావిస్తారు. బాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని పవన్ అనేకసార్లు చెప్పుకొచ్చారు. తనకు రాష్ట్రం కంటే ఏదీ ముఖ్యం కాదని కూడా ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు జైలుకు వెళ్ళక ముందు వరకూ పవన్ మీద ఉన్న అభిమానం వేరు. జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత అది కాస్తా రెట్టింపు అయింది అని అంటున్నారు. పవన్ అంటే విశ్వసనీయతకు మారు పేరు అని బాబు సహా టీడీపీ నేతలు అంతా నమ్ముతున్నారుట. పవన్ చాలా అవుట్ రేట్ గా టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు పొత్తులను పెట్టుకుంటామని మద్దతు ఇవ్వడాన్ని టీడీపీ అగ్ర నాయకత్వం చాలా విలువైనదిగానే చూస్తోంది అని అంటున్నారు.

ఇక పొత్తుల నేపథ్యంలో సీట్ల దగ్గర పేచీలు వస్తాయన్న దాన్ని కూడా పై స్థాయిలో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కసారిగా కూటమిని అనుకూల వాతావరణం జనంలో ఏర్పడితే మాత్రం సీట్ల సర్దుబాటు తో పాటు ఆ వచ్చే పంచాయతీలు అన్నీ కూడా సమసిపోతాయని భావిస్తున్నారు.

దీంతో ఇక మీదట ఏపీలో కీలక సభలకు అటు చంద్రబాబు పవన్ అటెండ్ కావాలని వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీని వల్ల ఏపీ రాజకీయం 2024 మొదట్లోనే పూర్తిగా మారే విధంగా చేయాలని ఆ టెంపోని ఎన్నికల దాకా కొనసాగిస్తే కచ్చితంగా కూటమి జెండా ఎగురుతుందని అంచనా వేస్తున్నారుట.

మరి పవన్ చంద్రబాబు ఇద్దరు కనిపించే ఆ వేదిక ఎక్కడ. తొలి కలయిక ఏ ప్రాంతంలో ఉంటుంది. ఏ సభ నుంచి ఇద్దరూ ప్రసంగిస్తారు అన్నది ప్రస్తుతానికి అయితే చర్చల దశలో ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News