ఢిల్లీకి బాబు...మోడీని ఏమి అడగనున్నారు ?

ఈ సందర్భంగా అనేక అంశాలు ఇద్దరి మధ్యన చర్చకు రానున్నాయని అంటున్నారు.

Update: 2024-07-02 17:03 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్తున్నారు. చంద్రబాబు సీఎం హోదాలో తొలి ఢిల్లీ పర్యటన అధికార పర్యటన ఇదే కావడం విశేషం. ఢిల్లీలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో ఈ నెల 4న భేటీ కానున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలు ఇద్దరి మధ్యన చర్చకు రానున్నాయని అంటున్నారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న సందర్భం సమయం చాలా కీలకమైనది. ఒక వైపు జేడీయూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని కేంద్రానికి అల్టిమేటం జారీ చేస్తున్న వేళ ఎన్డీయేకు బీహార్ నుంచి 17 మంది ఎంపీలు ఇదే డిమాండ్ తో నిలిచి ఒత్తిడి పెడుతున్న వేళ జనసేనతో కలిపి 18 మంది ఎంపీలు ఉన్న చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.

ఏపీ సీఎం గా జూన్ 12న పదవీ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఆనాడు మోడీని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఆ తరువాత ఇద్దరు నేతలు కలుసుకోలేదు. ఢిల్లీలో చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాల మీద మోడీతో చర్చిస్తారు అని అంటున్నారు. రానున్న అయిదేళ్ళలో పోలవరం అమరావతి రాజధానిలను పూర్తి చేయాలని చూస్తున్న చంద్రబాబుకు కేంద్ర సాయం చాలా అవసరం. అందువల్ల ఈ రెండు ప్రాజెక్టులకు దండీగా నిధులు ఇవ్వాలని బాబు కోరనున్నట్లుగా తెలుస్తోంది.

Read more!

అదే విధంగా ఏపీ చాలా ఇబ్బందులో ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువగా నిధుల సాయం చేసి ఆదుకోవాలని బాబు కోరనున్నారని అంటున్నారు. అంతే కాదు ఇదే నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ లో ఏపీకి మేలు చేసే విధంగా ప్రాజెక్టులను కేటాయించాలని కోరనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని కూడా ప్రధానికి చంద్రబాబు వినతి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా ఈ నెల 3 రాత్రికే ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది. వారితో కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి ఏపీకి భారీగానే నిధులు ప్రాజెక్టులు తీసుకుని వచ్చేలా చూస్తారని అంటున్నారు. చంద్రబాబు కేంద్ర మంత్రులను సీఎం హోదాలో కలవడం ఇదే ప్రథమం.

మరో వైపు ప్రధాని మోడీతో రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జేడీయూ మాదిరిగా కేంద్రాన్ని ఒత్తిడి చేసి బలవంతం చేయడం అన్నది చంద్రబాబు చేయరని, నమ్మకమైన నేస్తంగా ఉంటారని బీజేపీ వర్గాలు ఇప్పటికే భావిస్తున్నాయి. బాబు మీద పూర్తి విశ్వాసం బీజేపీ పెద్దలు ఉంచిన నేపధ్యంలో ఏపీకి సంబంధించి బాబు ఏది కోరుకున్నా ఇచ్చేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తి స్థయిలో సక్సెస్ కావడమే కాదు ఏపీకి మంచి శుభవార్తతోనే బాబు వెనక్కి తిరిగి వస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News

eac