జగన్‌కు షాక్.. అడ్డం తిరిగిన 'బంటు' నేత.. ?
ప్రస్తుతం ఒంగోలు పార్ల మెంటు ఇంచార్జ్‌గా చెవిరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.;

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చే పరిణామం చోటు చేసుకుంది. కీలక నాయకుడు.. ఒక రకం గా.. వైసీపీ అధినేత కుటుంబానికి నమ్మిన బంటుగా పనిచేస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. అడ్డం తిరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని చైర్మన్‌గా నియమించింది. అదేవిధంగా ఈ కమిటీలో ఇతర నాయకులకు కూడా చోటు కల్పించారు.
వీరిలో ముద్రగడ పద్మనాభరెడ్డి, భూమన కరుణాకర్ వంటివారికి చోటు పెట్టారు. ఇక, ఈ పరంపరలోనే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరును కూడా.. ముందు ప్రస్తావించి.. తర్వాత తీసేశారు. ప్రస్తుతం ఒంగోలు పార్ల మెంటు ఇంచార్జ్‌గా చెవిరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఒకరకంగా చెప్పాలంటే.. వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచి ఈ కుటుంబం వైసీపీతో సాగుతోంది.
ఈ నేపథ్యంలో తనకు ప్రాధాన్యం లేకుండా చేయడం పట్ల చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచా రం. గతంలో కూడా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. వైసీపీ విపక్షంలో ఉన్న 2014-19 మధ్య ఇటు అసెంబ్లీలోను.. అటు బయట కూడా.. చెవిరెడ్డి పోరాడారు. అనేక కేసులు కూడా పెట్టించుకున్నారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీటన్నింటికీ మించి.. జగన్ కుటుంబ అవసరాలను కూడా... ఆయన పర్యవేక్షిస్తుంటారు.
ఒకప్పుడు.. వైసీపీ పాలేరు! అని టీడీపీ నాయకుడు ఒకరు విమర్శించినప్పుడు.. ఔను.. నేను పాలేరునే. మా నాయకుడి కోసం ఏమైనా చేస్తా.. అని చెప్పారు. అలాంటి చెవిరెడ్డికి పీఏసీలో చోటు లేకపోవడంతో ఇప్పుడు ఆయన వర్గం కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిని నిరసిస్తూ.. చెవిరెడ్డి వైసీపీ అధిష్టానానికి ఘాటు లేఖ సంధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను ఎంత కష్టపడిందీ.. వివరించినట్టు తెలిపారని సమాచారం దీనిపై వైసీపీ అధినేత ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.