చైనా దక్షిణ కొరియాలో సరికొత్త ట్రెండ్.. ఎనర్జీ కోసం సెలైన్..

అయితే తాజాగా వెలుగు చూసిన మరొక విషయం ఉద్యోగస్తులను భయాందోళనలకు గురిచేస్తుంది.

Update: 2024-10-04 23:30 GMT

ఉద్యోగాలు చేసే వారికి 9 టూ 5 జాబ్ ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగానికి వెళ్లడం మన చేతుల్లో ఉంటుంది కానీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయం మాత్రం ఎవ్వరి చేతుల్లో ఉండదు. పని వత్తిడితో ఉద్యోగస్తులు తీవ్రమైన ఆందోళనకు, అస్వస్థతకు గురి అవుతున్నారు. చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాలలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ పని వేళలు, ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో సోషల్ మీడియా పుణ్యమా అని అందరికీ తెలిసింది. అయితే తాజాగా వెలుగు చూసిన మరొక విషయం ఉద్యోగస్తులను భయాందోళనలకు గురిచేస్తుంది.

విధి నిర్వహణలో పూర్తిగా అలసిపోతున్న ఉద్యోగస్తులు రెస్ట్ తీసుకుంటే టైం ఖర్చయిపోతుంది అని భయపడుతున్నారో ఏమో తెలియదు కానీ కొత్తగా సెలైన్ పెట్టుకొని మరీ ఓపిక తెచ్చుకుంటున్నారు. ఈ ఐవీ ద్వారా కొన్ని విటమిన్లతో కలిసిన ద్రవాన్ని శరీరంలోకి ఎక్కిస్తారు. దీంతో తక్షణమే శక్తి లభించి.. విశ్రాంతి తీసుకోవాలి అన్న అవసరం లేకుండా పోతుంది. మొదట్లో ఈ చికిత్సను క్యాన్సర్, కీళ్ల సమస్యలు, ఎదుగుదల లోపం ఉన్న పేషంట్స్ ను ట్రీట్ చేయడానికి ఉపయోగించేవారు.

అయితే ఇప్పుడు దీన్ని కృత్రిమంగా శరీరానికి ఎనర్జీని ఇవ్వడం కోసం ఉపయోగిస్తున్నారు. సియోల్లోని కొన్ని క్లినిక్స్ లో ఈ సెలైన్ ధర 25,000-60,000 వోన్లు ఉంది. ఈ సెలైన్ ఎక్కడానికి 40 నిమిషాలు పడుతుంది.. మంచి ఫలితం ఉండాలి అంటే ప్రతివారం వచ్చి ఒక సెలైన్ ఎక్కించుకోవలసి ఉంటుంది. వీటిలో సిండ్రిల్లా, గార్లిక్,ప్లసెంటా డ్రిప్స్ అంటూ ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. సిండ్రిల్లా విటమిన్ సి కాంబినేషన్ తో ఉంటుంది కాబట్టి ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది అంట.గార్లిక్ వెరైటీ మన శరీరానికి అవసరమైన బి1 వంటి ఎన్నో విటమిన్ లను అందిస్తుంది అలాగే నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

జీవితంలో విజయం సాధించాలి అనే ఆకాంక్ష.. పక్కన వారి కంటే వెనక పడిపోతామని డిప్రెషన్.. పని ఒత్తిడి కారణంగా చాలామంది యువత వీటిని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియాలో ట్రెండ్ గా మారుతున్న ఈ ట్రీట్మెంట్ పై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరానికి ఎప్పుడైనా సహజంగా తీసుకుని ఆహారం ద్వారా లభించే శక్తి మంచిది కానీ ఇటువంటివి వాడడం వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు.

Tags:    

Similar News