ఆ దేశమే ఒక జైలు.. కొత్తగా 200 జైళ్లు.. ఎవరి కోసమో..?

చైనా అంటే పటిష్ఠమైన, పొడవైన చైనా వాల్ మాత్రమే కాదు. కఠినమైన క్రమశిక్షణ. ఇప్పుడు ఈ దేశంలో కొత్తగా 200 జైళ్లను నిర్మిస్తున్నారు.

Update: 2024-12-30 02:30 GMT

ఆ దేశంలో ఏం జరిగినా బయటకు తెలియదు.. అక్కడ వ్యవస్థే వేరు.. ప్రభుత్వం ఏం చేసినా సొంతంగానే చేయాలంటుంది.. ప్రపంచమంతా ఒకవైపు నిలిచినా ఆ దేశం ఒంటరిగా ఎదుర్కొంటుంది.. ఎవరికీ అదరదు.. బెదరదు.. అంతెందుకు..? యావత్ భూగోళాన్ని భయాందోళనలకు గురిచేసిన వైరస్ ఆ దేశంలోనే పుట్టిందని అందరూ ఆరోపిస్తున్నా ఇంతవరకు రుజువు చేయలేకపోయారు.. మొత్తానికి ఆ దేశమే ఒక పకడ్బందీ జైలు.

నాలుగేళ్లలో..

చైనా అంటే పటిష్ఠమైన, పొడవైన చైనా వాల్ మాత్రమే కాదు. కఠినమైన క్రమశిక్షణ. ఇప్పుడు ఈ దేశంలో కొత్తగా 200 జైళ్లను నిర్మిస్తున్నారు. అది కూడా పకడ్బందీగా. ప్రత్యేక నిబంధనలతో.. ఇప్పటికే ఏడాదిన్నర రెండేళ్ల నుంచి జైళ్లను కడుతున్నారు. 2027వరకు నిర్మాణం పూర్తి చేయనున్నారు. వీటిల్లో ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా, హాని చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. ప్యాడెడ్‌ వాల్‌, యాంటీ స్లీప్‌ సర్ఫేస్‌ తో నిర్మించున్నారు. అనుమానితులను కుటుంబాలతో కూడా కలవనీయరు. న్యాయ సాయం అందించరు. దాదాపు 6 నెలల వరకు బంధించి ఉంచుతారు. బందీలను నిద్ర కూడా పోనీయరు. రోజులో 18 గంటలు కూర్చొనే ఉండాలి.

చైనా అధ్యక్షుడు షి జిన్‌ పింగ్‌ అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగమే జైళ్ల నిర్మాణం. వీటిని లియు జూ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు.

షి జిన్‌ పింగ్‌ 2012లో అధికారంలోకి వచ్చారు. క్రమంగా చైనా కమ్యూనిస్టు పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటున్నారు. వరుసగా మూడోసారీ అధికారం చేపట్టారు.

వ్యతిరేకులను అణచివేసేందుకేనా...

జిన్ పింగ్ పైకి అవినీతి వ్యతిరేక పోరాటం అంటున్నా.. తనను ఎదిరించే వారిని జైల్లోవేస్తారన్న ఆరోపణలున్నాయి. చైనాలో షుయాంగి అనే వ్యవస్థ ఉంది. దీనికి హక్కుల ఆందోళనకారులను అణచివేస్తుందన్న చెడ్డ పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో లియుజూ కేంద్రాలను నిర్మిస్తున్నారు. 24 గంటలూ గస్తీ, నిఘా కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ అధికారులే కాదు.. అధికారులు, సివిల్‌ సర్వెంట్లు, ఉన్నత స్థాయి వ్యక్తులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకోనున్నారు.

కాగా 2017 నుంచి 210 లియుజూ సెంటర్లను నిర్మించారు. మరో 200 నిర్మాణాలు చేపడుతుండడం ఎందుకో? ఎవరి కోసమో మరి..?

Tags:    

Similar News