భారత్ లో ఎన్నికలపై చైనా కుట్రలు... మైక్రోసాఫ్ట్ సంచలన హెచ్చరికలు!

ఈ మేరకు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-04-06 08:35 GMT

భారత్ విషయంలో చైనా నిత్యం తన వక్రబుద్దిని చాటుకుంటూనే ఉంది! ఏమాత్రం అవకాశం వచ్చినా భారత్ ను ఎలా అనే ఆలోచనే చైనా నిత్య కృత్యం అని అంటుంటారు. ఈ సమయంలో కుక్కతోక వంకర మాదిరి చైనా మరోమారు భారత్ విషయంలో తన బుద్దిని చూపించాలనుకుంటోందని తెలుస్తుంది! ఈ మేరకు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

అవును... భారత్ ను ఇబ్బందిపెట్టాలని నిత్యం పరితపించే విషయంలో పాకిస్థాన్ తో పోటీపడుతూ ముందుకు కదులుతున్న చైనా వ్యవహారం తెలిసిందే. ఈ నేపథ్యంలో... భారత్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... భారత్ లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది.

త్వరలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా హ్యాకర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ని ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపింది. ఇలా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు చైనా సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ ను వాడుతూ... భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని టెక్ దిగ్గజం హెచ్చరించింది!

ఈ ఏడాదిలో చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఏడాదిని ఎన్నికల ఏడాది అని అంటారని చెబ్బుతున్నారు. ఈ క్రమంలో సుమారు 64 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికల ఫలితాల అనంతరం కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. సరిగ్గా ఈ సమయంలో... మైక్రోసాఫ్ట్‌ ఈ హెచ్చరిక చేసింది. దీంతో... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం వైరల్ గా మారుతోంది!

కాగా... భారత్ లో ఈ ఏడాది 17వ లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి దశ ఏప్రిల్ 19న ప్రారంభమవుతుండగా.. రెండో దశ ఏప్రిల్ 26న జరుగుతుంది. ఇదే క్రమంలో మూడో దశ మే 7న, మే 13న నాలుగో దశ, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, జూన్ 1న ఏడో దశ ముగుస్తుంది. ఇక వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి!! ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ నుంచి ఇలాంటి హెచ్చరికలు రావడం సంచలనంగా మారింది!

Tags:    

Similar News