ఆర్మీ.. నేవీ.. ఎయిర్ ఫోర్స్.. వీటినిమించి డ్రాగన్ సైబర్ సైన్యం!
చైనా అంటే దురాక్రమణదారు. పొరుగు దేశాల భూభాగాలపై ఎప్పుడూ దాని కన్ను ఉంటుంది.
మిగతా ప్రపంచం అంతా అణ్వాయుధం గురించి ఆలోచిస్తుంటే.. ఆ దేశం మాత్రం జీవాయుధంపై ఫోకస్ పెట్టింది.. టెక్నాలజీలో మిగతా ప్రపంచం అమెరికా లేదా యూరప్ ను ఫాలో అవుతుంటే.. ఆ దేశం మాత్రం సొంత వ్యవస్థను డెవలప్ చేసింది. మనలాగా అక్కడ వాట్సప్ ఉండదు.. వారికో సొంత మెసేజింగ్ యాప్ ఉంటుంది.. ఇతర ప్రపంచం ఏం చేసినా దానికి ప్రతిరూపాన్ని రూపొందిస్తుంది.. ఇపుడు యుద్ధాల కాలంలో ఏకంగా సైబర్ సైన్యాన్ని తయారు చేసింది.
అది జిత్తులమారి డ్రాగన్
చైనా అంటే దురాక్రమణదారు. పొరుగు దేశాల భూభాగాలపై ఎప్పుడూ దాని కన్ను ఉంటుంది. అలాంటి చైనా ప్రపంచంలోనే శక్తిమంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. ఇప్పుడు మరో సంచలన అడుగు వేసింది. మిలటరీకి తోడుగా కొత్త సైన్యాన్ని తీసుకొస్తోంది. అదే.. సైబర్ సైన్యం. దీనికి ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎఫ్ఎస్)గా పేరుపెట్టింది. దీనికి యుద్ధాలను గెలిచే సామర్థ్యం ఉందంటూ చెబుతోంది. ఈ మేరకు ఐఎఫ్ఎస్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అణు, జీవ కాదు.. మున్ముందు సైబర్ వార్ లే..
ఇప్పటివరకు అణ్వాయుధాలు చూశాం, జీవాయుధాల గురించి విన్నాం.. అయితే టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో మున్ముందు జరిగేవన్నీ సైబర్ యుద్ధాలే. దేశ ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసే శక్తి సైబర్ యుద్ధాలకు ఉంటుందనడంలో సందేహం లేదు. కాగా,
ఐఎఫ్ఎస్.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి వ్యూహాత్మక విభాగంగా ఉండనుంది. పీఎల్ఏకు గట్టి అండగా మారనుంది. ఓవిధంగా చైనా అధునాతన సమాచారం- సైబర్ వార్‌ఫేర్ సామర్థ్యాల ద్వారా తన సైనిక పరాక్రమాన్నిపెంచుకుంది.
నెట్ వర్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ల ఏకీకరణ, అప్లికేషన్ లో పునాదిగా పనిచేస్తూ, ఆధునిక యుద్ధంలో ఐఎస్ఎఫ్ కీలకంగా మారనుంది.
పదేళ్ల కిందటే..
ఐఎస్ఎఫ్ ఆలోచనకు 2015లోనే పునాది పడింది. వ్యూహాత్మక భద్రతా దళం (స్ట్రాటజిక్ సెక్యూరిటీ ఫోర్స్) నుంచి పుట్టిందే ఐఎస్ఎఫ్ అనుకోవచ్చు. అంతరిక్షం, సైబర్, రాజకీయ, టెక్నికల్
యుద్ధాలను ఉద్దేశించి స్ట్రాటజిక్ సెక్యూరిటీ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. మున్ముందు అంతా "సమాచార యుద్ధాలు" కాబట్టి.. వాటిలో ఐఎస్ఎఫ్, పీఎల్ఏ స్పేస్ ఫోర్స్,సైబర్ స్పేస్ ఫోర్స్ బాధ్యతలను ప్రత్యేకించినట్లు తెలుస్తోంది.