ప్రభుత్వ రాయితీలపై చినజీయర్‌ స్వామివ్యంగ్యాస్త్రాలు!

చినజీయర్ స్వామి.. పెద్దగా పరిచయం అవసరం లేని పేర్లలో ఇది ఒకటి. ఈయన వ్యాఖ్యానాలు, ప్రసంగాలు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు

Update: 2023-12-08 10:09 GMT

చినజీయర్ స్వామి.. పెద్దగా పరిచయం అవసరం లేని పేర్లలో ఇది ఒకటి. ఈయన వ్యాఖ్యానాలు, ప్రసంగాలు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా... అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే ఇంక పనెందుకు అనే ధోరణిలో ప్రజలు ఉన్నారని చినజీయర్‌ స్వామి అభిప్రాయపడ్డారు!

తాజాగా కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్‌ ను చినజియర్ స్వామి ప్రారంభించారు. అనంతరం ఫ్యాక్టరీలోని ఇంటిగ్రేటెడ్ డైరీ సిస్టం ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. మానవసేవే మాదవసేవ అని అన్నారు. ఇదే సమయంలో పశుసేవ కూడా మాదవసేవతో సమానమని అన్నారు. ఇలాంటి సేవను ఎంచుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా పాలసేకరణలో విజయాడైరీ రైతులకు అండగా నిలవడం విశేషమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మనదేశంలో పాలను ఉత్పత్తి చేసేటువంటి పెద్ద పెద్ద అమూల్ వంటి సంస్థల్లో కూడా రైతులకు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మించినటువంటి ప్రతిఫలం ఇక్కడ కృష్ణా యూనియన్ లో ఇవ్వగలుగుతున్నామని అని యజమాని ఆంజనేయులు గతంలో తనకు చెప్పినట్లుగా చినజియర్ స్వామి చెప్పుకొచ్చారు.

అనంతరం ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నాయని చినజీయర్‌ స్వామి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా... "ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి, పోతే ఒకటి, కూర్చుంటే ఒకటి, నడిస్తే ఒకటి, పడుకుంటే మరొకటి... తింటే రాయితీ, తినకపోతే రాయితీ.. ఇలా ప్రతిదానికీ రాయితీలు ఇస్తూ ప్రజల్ని బద్ధకస్తులుగా, బలహీనులుగా తయారు చేస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News