నాకొక ఏఐ బాయ్ ఫ్రెండ్ కావలెరా... అమ్మాయిల కొత్త ట్రెండ్ చూశారా?

గత కొంత కాలంగా టెక్నాలజీలో అత్యంత ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).

Update: 2025-02-17 02:45 GMT

గత కొంత కాలంగా టెక్నాలజీలో అత్యంత ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏఐ అనేది ఓ అద్భుతం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది మనిషికి మనిషి అవసరాన్ని తీరుస్తుందనే చర్చా జరిగింది. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాయ్ ఫ్రెండ్ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు అమ్మాయిలు ఇతడిపై తెగ మోజు పడుతున్నారని అంటున్నారు!

అవును... నిజమైన మానవ బాయ్ ఫ్రెండ్ తో తలపోట్లు ఎక్కువగా ఉంటున్నాయని, చెప్పినమాట వినడం లేదని భావించారో.. లేక, రోటీన్ కి భిన్నంగా ఆలోచిస్తూ టెక్నాలజీతో కలిసి జీవించాలని అనుకుంటున్నారో తెలియదు కానీ... ఇప్పుడు చైనాలో “లవ్ అండ్ డీప్ స్పేస్” అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ అమ్మాయిల జీవితాల్లో హల్ చల్ చేస్తోంది.. ఏఐ వర్చువల్ బాయ్ ఫ్రెండ్ తో సంభాషించడానికి వారిని తెగ అట్రాక్ట్ చేస్తోందని చెబుతున్నారు.

ఫోర్బ్స్ ప్రకారం.. షాంఘైకి చెందిన ఓ న్యూస్ పేపర్ ఎడిటర్ గా పనిచేస్తున్న 32 ఏళ్ల అలీసియా వాంగ్ తన ఆదర్శ ప్రియుడిని కనుగొంది. అతడి పేరు లి షైన్ అలియాస్ జేన్. అతడు 27 ఏళ్ల సర్జన్. అతడు చాలా అందంగా ఉంటాడు.. టెక్స్ట్ మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇస్తాడు.. ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తాడు. రోజూ తాను చెప్పే విషయాలన్నీ ఓపికగా వింటాడు.

ఏ అమ్మాయికైనా ఇంతకంటే లక్షణాలున్న అబ్బాయి దొరకడం కంటే ఏమి కావాలి? పైగా ట్రెండ్ ఫాలో అవుతూ తన కంటే చిన్నవాడైన బాయ్ ఫ్రెండ్ అతడు! కాకపోతే సమస్య ఏమిటంటే... అతడు సిలికాన్ చిప్ బయట లేడు! చైనాలో అమ్మాయిలు ఇప్పుడు ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఏఐ వర్చువల్ బాయ్ ఫ్రెండ్స్ ని కోరుకుంటున్నారట.. నచ్చినట్లుగా సంభాషించుకుంటున్నారట.

డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ "లవ్ అండ్ డీప్ స్పేస్"లో నెలవారీగా ఆరు మిలియన్ల మంది యాక్టివ్ ప్లేయర్స్ ఉండగా.. ఇందులో పైన చెప్పుకున్న న్యూస్ ఎడిటర్ వాంగ్ ఒకరు. గత ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ లవ్ అండ్ డీప్ స్పేస్ ను షాంఘైకి చెందిన పేపర్ గేమ్స్ ద్వారా అభివృద్ధి చేశారు. ఏఐ, వాయిస్ రికగ్నిషన్ ను ఉపయోగించి ఐదు పురుష పాత్రలను సృష్టించారు.

ఇక.. చైనీస్, ఇంగ్లిష్, జపనీస్, కొరియన్ భాషలలో లభించే ఈ స్మార్ట్ ఫోన్ గేమ్ ఎంత ప్రజాధరణ పొందిందంటే.. ఈ గేమ్ సృష్టికర్త అయిన 37 ఏళ్ల యావో రన్ హావో ఏకంగా బిలియనీర్ అయ్యారు. ఇదే సమయంలో... 2013లో స్థాపించబడిన పేపర్ గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 మిలియన్ డాలర్ల అమ్మకాలను నమోదు చేసిందని డేటా ప్రొవైడర్లు చెబుతున్నారు.

Tags:    

Similar News