‘జనసేనలో అరాచక శక్తులు చేరాయి’... చింతమనేని ఫైర్!
ఈ సమయంలో ఈ వ్యవహారాలపై తాజాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని రోజులుగా దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య పలు ఇబ్బందికర వాతావరణం నెలకొందని.. దానికి వేరే పార్టీ నుంచి ఇటీవల జనసేనలో చేరిన వ్యక్తులే కారణమని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో ఈ వ్యవహారాలపై తాజాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు పీక్స్ కి చేరాయని అంటున్నారు. తాజాగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. అవి పూర్తిగా బయటపడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన వివరాల మేరకు ఎమ్మెల్యే చింతమనేని స్పందించారు. జనసేనలో కొన్ని అరాచక శక్తులు చేరాయని అన్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన చింతమనేని... నిన్నటివరకూ ఈ రాష్ట్రాన్ని, జిల్లని, గ్రామాల్ని ఎవరైతే దురుసుగా పరిపాలన చేశారో.. వాళ్లలో కొంతమంది అరాచక శక్తులు జనసేన పార్టీ కండువాలు కప్పుకుని, ఆ ముసుగులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. ఈ ప్రయత్నాలను తప్పకుండా ఆ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
అలాంటి వ్యక్తులు తమ పబ్బం గడుపుకోవడానికి జనసేనలోకి వస్తే వచ్చారు కానీ... పెన్షన్స్ పంచే కార్యక్రమంలో వారికి ఏమి సంబంధం అని చింతమనేని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాళ్లు కూటమి కోసం పనిచేయలేదని.. కూటమి కోసం ఓట్లు అడగలేదని.. అలాంటి వారికి ఈ విషయంలో ఏమి సంబంధం అని ప్రశ్నించారు.
నాడు కూటమి ఓడిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులే నేడు.. అధికారంలోకి వచ్చిన పార్టీల్లో చేరి అధికారం చలాయిస్తామంటే అది సాధ్యపడే విషయమా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పద్దతులు మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.