సీఎంఆర్ఎఫ్‌కు మెగాస్టార్ విరాళం.. చెక్కు అందజేత.. వాటి విలువ ఎంతంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించాయి. ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ ఎత్తున నష్టం వచ్చింది.

Update: 2024-09-16 08:21 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించాయి. ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ ఎత్తున నష్టం వచ్చింది. ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు పెద్ద ఎత్తున డ్యామేజీ అయ్యాయి. పంటలు తీవ్రంగా నష్టపోయారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఈ వర్షాలతో రూ.10వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు.

ఇటీవలే ఆ నష్టాన్ని కేంద్ర బృందం వచ్చి పరిశీలించింది. కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించారు. రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని, కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇదే క్రమంలో పలువురు దాతలు సైతం ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు.. జరిగిన నష్టానికి ఎంతో కొంత చేదోడుగా నిలిచేందుకు విరాళాలు అందించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చారు. వారితోపాటే కాంట్రాక్టర్లు, పలు సంస్థలూ ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి.

అందులో మెగా ఫ్యామిలీ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ రూ.కోటి సహాయం అనౌన్స్ చేశారు. ప్రకటించినట్లుగానే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి తనకు సంబంధించిన రూ.50 లక్షలు, రామ్ చరణ్‌కు సంబంధించి రూ.50 లక్షల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు.

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా ప్రకటించినట్లుగా ఈ రోజు కోటి రూపాయల చెక్కును సీఎంకు అందించారు. అలాగే.. తెలుగు సినీ ఫీల్డ్ నుంచి నటులు విశ్వక్‌సేన్, సాయి ధరమ్ తేజ్ చెరో రూ.10 లక్షలు, కమెడియన్ అలీ రూ.3 లక్షలు సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ఇచ్చారు.

Tags:    

Similar News