చిరంజీవిపై కిరణ్ బేడి కామెంట్స్.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ లేదా?
కానీ కొన్ని వర్గాలు ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక సరదా వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ‘వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చరణ్‌ను అడుగుతుంటా’ అనే వ్యాఖ్యను ఆయన ఇటీవల ఓ షోలో సరదాగా చేశారు. అయితే ఈ మాటలను కొందరు వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదన్న విషయం వీడియో చూస్తేనే స్పష్టమవుతుంది. కానీ కొన్ని వర్గాలు ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
- సరదా వ్యాఖ్యలపై తప్పుడు అర్థాలు
చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సరదాగా చేసిన మాటలు మాత్రమే. షోలో ఉన్న హాస్యభరిత వాతావరణంలో మాట్లాడుతూ చేసిన మాటల్ని సీరియస్ గా తీసుకొని ఆయనపై విమర్శలు చేయడం అన్యాయమని మెగాస్టార్ అభిమానులు అంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా లింగ వివక్ష చూపే వ్యక్తి కాదని, ఎన్నో సేవా కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటున్నారు.
- కిరణ్ బేడీ స్పందన
మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘‘చిరంజీవి గారూ.. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఆమె వ్యాఖ్యలు కొత్త దుమారం రేపాయి.
- మెగాస్టార్ అభిమానుల ఆగ్రహం
ఈ విమర్శలు చిరంజీవి అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ఆయన లింగ వివక్షను ప్రోత్సహించేందుకు అలా మాట్లాడలేదని, తాను సరదాగా అన్న మాటలను వక్రీకరించడం సరికాదని అంటున్నారు. పైగా గతంలో చిరంజీవి మహిళా సాధికారతకు అనేక సహాయాలు అందించారని, పలువురు మహిళా కళాకారులకు ఆయన ఎంతో మద్దతు ఇచ్చారని చెబుతున్నారు.
- వివాదాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి
సినిమా పరిశ్రమలో చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు ఎంతో ప్రేరణగా నిలుస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, సదుద్దేశంతో చేసిన సరదా వ్యాఖ్యలను అనవసరంగా వివాదాస్పదం చేయడం మానుకోవాలని మెగాస్టార్ అభిమానులు కోరుతున్నారు. అసలు విషయం తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం అనైతికమని, ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల సమాజంలో అనవసర చర్చలు కొనసాగుతాయని సూచిస్తున్నారు.