ఇది మామూలు శునకం కాదు.. 'చిట్టి' ది రోబో... వీడియో వైరల్!

ఈ సమయంలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఓ డాగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

Update: 2024-09-28 16:30 GMT

ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏ స్థాయిలో ప్రతీ రంగంలోనూ తన ముద్ర వేస్తోందనేది తెలిసిన విషయమే. పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు కూడా ఏఐ సేవలను విరివిగా వినియోగించుకునే పనిలో ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఓ డాగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

అవును... ఏఐ టెక్నాలజీతో రూపొందించిన పరికరాలు మార్కెట్ లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా చెన్నైలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ లో ఏఐతో పనిచేసే శునకం "చిట్టి ఏఐ డాగ్" అందరినీ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... చెన్నైలోని బిర్లా ప్లానిటోరియంలో స్కూల్, కాలేజ్ విద్యార్థుల కోసం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు యువకులు "లెట్ మేక్ ఎడ్యుకేషన్ బెటర్" అనే చిట్టి రోబో డాగ్ ని ప్రదర్శించారు. దీని బరువు 25 కిలోలు ఉండగా.. దీనికి సంబంధించిన వివరాలు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ రోబో డాగ్ కూడా సాధారణ శునకాల మాదిరిగానే ఎగరడం, కాళ్లపై కూర్చోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు పనులు కూడా చేస్తోందంట. దీనిని స్మార్ట్ ఫోన్ సాయంతో నియంత్రించవచ్చని చెబుతున్నారు. దీనిలోపల హెచ్.డీ. కెమెరా అమర్చి ఉండటంతో ఇంటికి సెక్యూరిటీగా పనిచేస్తుందని.. దీని బ్యాటరీ సుమారు గంట సేపు వస్తుందని చెబుతున్నారు.

ఇక రజనీకాంత్ రోబో సినిమా ఆధారంగా దీనికి "చిట్టి" అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. కాగా... శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో రజనీకాంత్ పాత్ర సృష్టించిన రోబో పేరు "చిట్టి" అనేది తెలిసిన విషయమే.

Full View
Tags:    

Similar News