కొడుకుతో బలవంతంగా ట్రెడ్ మిల్.. ఆయువు తీసిన తండ్రి

వద్దని ఎంత వారించినా వినకుండా అతడిని కొడుతూ పరుగెత్తించాడు. దీంతో అతడి అవయవాలు దెబ్బతిని మెల్లగా చావుకు దగ్గరయ్యాడు.

Update: 2024-05-03 05:56 GMT

ఓ తండ్రి చేష్టలకు కుమారుడు బలయ్యాడు. పసిప్రాయంలోనే లావుగా ఉన్నాడనే కారణంతో ట్రెడ్ మిల్ పై పరుగెత్తించడంతో అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచాడు. తండ్రి ఘాతుకానికి తనయుడు ప్రాణాలు వదిలాడు. వద్దని ఎంత వారించినా వినకుండా అతడిని కొడుతూ పరుగెత్తించాడు. దీంతో అతడి అవయవాలు దెబ్బతిని మెల్లగా చావుకు దగ్గరయ్యాడు.

న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ కు ఓ ఆరేళ్ల కుమారుడున్నాడు. అతడు బొద్దుగా ఉండటంతో తండ్రి ట్రెడ్ మిల్ పై పరుగెత్తాలని ఓ సెంటర్ కు తీసుకెళ్లాడు. అక్కడ అతడిని దానిపై నిలబెట్టి పరుగు తీయమన్నాడు. వేగం పెంచుతూ అతడిని వేధించాడు. వద్దు డాడీ అన్నా వినిపించుకోలేదు. పలుమార్లు అతడిని కొట్టాడు. దీంతో విధిలేని పరిస్థితిలో తండ్రి మాటకు పరుగెత్తాడు.

మెల్లగా అతడి ఆరోగ్యం దెబ్బతింది. గుండె, లివర్, ఇతర అవయవాలు కూడా పనిచేయకుండా పోయాయి. అతడి ఆరోగ్యం క్షీణించడంతో తల్లి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో అతడు తన ప్రాణాలు వదిలాడు. దీనిపై విచారణ జరగగా తండ్రి కారకుడని తేలింది. సాక్ష్యంగా నిలిచిన ట్రెడ్ మిల్ ఆధారాలు చూసి అవాక్కయ్యారు.

కొడుకు చావుకు ప్రత్యక్షంగా తండ్రే కారకుడని తేలడంతో అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పసిప్రాయంలో ఉన్న అతడిని వేధింపులకు గురి చేసి అతడి చావుకు కారకుడైన తండ్రిపై అందరు శాపనార్థాలు పెడుతున్నారు. కన్న కొడుకును చంపుకున్న కసాయి తండ్రి అని తిడుతున్నారు. బాలుడి ఆయువు తీసిన వాడికి శిక్ష కఠినంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

బాలుడి స్కానింగ్ లో అతడి అంతర్గత అవయవాలకు గాయాలైనట్లు తేలింది. గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. బాలుడి దయనీయ స్థితిని చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కొడుకు చావుకు కారణమైన తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ తండ్రి అనాలోచిత ఆలోచన అతడి ప్రాణాలకే శాపంగా మారడం గమనార్హం.

Tags:    

Similar News