తన అడ్రస్ చెప్పిన లోకేష్... విచారణ డేట్ & టైం ఇదే!

అవును... తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఎక్కడికీ పోలేదని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హోటల్ మౌర్యాలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అప్పుడప్పుడూ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నట్లు వెల్లడించారు.

Update: 2023-09-30 12:47 GMT

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో నారా లోకేష్ ను ఏ-14గా చేర్చుతూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేయడం... దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకోవడం.. దీన్ని ఏపీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించడంతోపాటు.. 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే... లోకేష్ కు సీఐడీ నోటీసులు అందించాలని ఎంత ప్రయత్నించినా ఆయన అడ్రస్ దొరకలేదని... నివాస స్థలంతోపాటు, ప్రయాణిస్తున్న కార్లను కూడా మారుస్తూ "దొంగా – పోలీస్" ఆట ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తాజాగా లోకేష్ స్పందించారు. తాను ఎక్కడున్నదీ చెప్పారు!

అవును... తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఎక్కడికీ పోలేదని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హోటల్ మౌర్యాలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అప్పుడప్పుడూ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నట్లు వెల్లడించారు. సో... సీఐడీ వాళ్లు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటానని లోకేష్ అన్నారు.

ఇదే సమయంలో దాక్కునే అలవాటు తనకు లేదని, తాను ఢిల్లీ వచ్చినప్పటినుంచీ ఎక్కడ ఉంటున్నాననే విషయం అందరికీ తెలుసు అని, అయినప్పటికీ కొంతమంది కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో.. తాను ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఉంటూ నిత్యం పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. మరోపక్క సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి వెళ్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు నారా లోకేష్ అందుబాటులోకి రాకపోవడంతో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు వాట్సప్‌ ద్వారా నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. అనంతరం అడ్రస్ వెల్లడి అవ్వడంతో గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు సీఐడీ అధికారులు. అయితే ఆయన ఇంట్లో లేరు.. ఆఫీసులో ఉన్నారని చెప్పడంతో... అశోక్‌ రోడ్డులోని 50వ నెంబర్‌ గృహంలో ఉన్న జయదేవ్‌ కార్యాలయానికి వెళ్లారట అధికారులు.

అనంతరం గల్లా ఆఫీసులో లోకేష్ ని కలిసిన అధికారులు... ఆయనకు నోటీసు ఇచ్చారట. ఇందులో భాగంగా ఇన్నర్‌ రింగు రోడ్డు అలైన మెంట్ కేసులో అక్టోబర్‌ 4 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సీఐడీ.

దీంతో.. ప్రస్తుతం ఈ విషయంపై లోకేష్... సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. విచారణకు హాజరైతే కచ్చితంగా సహకరించాలి, సమాధానాలు చెప్పాలి. అలా కాదని "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను" అని అంటే విచారణకు సహకారించడం లేదనే కారణంతో కస్టడీ కొరే ప్రమాధం ఉంది. దీంతో... ఈ విషయంపై లోకేష్.. సీనియర్ న్యాయవాదులతో తీవ్ర సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News